Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట : మంత్రి కొప్పుల

కులవృత్తులకు ప్రభుత్వం పెద్దపీట : మంత్రి కొప్పుల

జగిత్యాల ప్రతినిధి,(మన సాక్షి)

జగిత్యాల జిల్లా కేంద్రం మోతె గ్రామం గొల్లపల్లి రోడ్డులో టియుఎఫ్ఐడీసీ నిధులు 2 కోట్ల తో నిర్మించబోయే మోడ్రన్ దోబీ ఘాట్ ను స్థానిక శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తో కలిసి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేసారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని కుల వృత్తులను కాపాడుకొనేందుకు ఎన్నో పతకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు.రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!

ముఖ్యమంత్రి రజకులకు హైదరాబాద్ లో మూడు ఎకరాల స్థలం ఇచ్చి ఆత్మ గౌరవం నిలబెట్టారని మంత్రి తెలిపారు. 50 సంవత్సరాలు ఏకంగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పాలకులు వాస్తవం చెప్పాలంటే నిధులను ఎక్కడికి పోయినాయి, అభివృద్ధి ఎందుకు చేయలేదు ఎందుకు ఆలోచన రాలేదనేది మనం అనుకుంటే చాలా ఆశ్చర్యమే అనిపిస్తుంది.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో రజకులు, బ్రాహ్మణులు, కుమ్మరి, కమ్మరి, గౌడ చిన్న వర్గాలను గుర్తించి వాళ్ళు కూడా ఆర్థికంగా బాగు చేయాలనేదే మన ముఖ్యమంత్రి యొక్క ఆలోచన అని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ,స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ , కమిషనర్ అనిల్ ,ఈఈ సంపత్ , డిఈ రాజేశ్వర్ , మాజీ మున్సిపల్ చైర్మన్ దేశాయ్, మనాల కిషన్, సమిండ్ల శ్రీనివాస్,శివ కేసరి బాబు, రజక సంఘం అధ్యక్షులు శంకర్, జిల్లా మండల రజక సంఘం అధ్యక్షులు నారాయణ, పొచాలు సంఘం సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

మరిన్ని వార్తలు