సూర్యాపేట : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు లో మంత్రి విఫలం

కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట : ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు లో మంత్రి విఫలం

కాంగ్రెస్ నేత పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట , మనసాక్షి

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కకళాశాల, మహిళా జూనియర్ కళాశాల ను ఏర్పాటు చేయడంలో మంత్రి జగదీశ్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు గడప గడపకు యూత్ కాంగ్రెస్ కార్యక్రమంలో శనివారం 29వ వార్డులో బైరు మహేష్ , కుంచం రమేష్ అద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

 

ALSO READ :

  1. మిర్యాలగూడ : దొంగతనాలకు, మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు
  2. Education : తెలంగాణలో కెసిఆర్ విద్యా కానుక..!
  3. UGC : ఆ యూనివర్సిటీలు ఫేక్.. ఆ డిగ్రీలు చెల్లవు..!
  4. TS TET NOTIFICATION : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

దశాబ్ది ఉత్సవాల పేరుతో ఆర్భాటాలకు పోయు కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

రుణమాఫీ పేరుతో కొత్త డ్రామాకుల సీఎం కేసీఆర్ తెరలేపారని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునెందుకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏనాడైనా వార్డులలో పర్యటించారని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు సంపాదించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి రాజా ,షఫిఉల్లా ,శెనగాని రాంబాబు గౌడ్ , నేరేళ్ల మధు ,వంకాయలపాటి శంకర్ చౌదరి ,గోపగాని గిరిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.