మిర్యాలగూడ: ఘనంగా రాహుల్ గాంధీ జన్మదినం..!

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం ను పురస్కరించుకొని బుధవారం పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా హాస్పిటల్ లో పేషెంట్స్ కు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది.

మిర్యాలగూడ: ఘనంగా రాహుల్ గాంధీ జన్మదినం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం ను పురస్కరించుకొని బుధవారం పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏరియా హాస్పిటల్ లో పేషెంట్స్ కు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎవరు కూడా బర్త్డే కేక్స్ కట్ చేయవద్దని మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పేదలకు అండగా ఉంటాం అనే భరోసాని ఇస్తూ వారికి సహాయ సహకారాలు అందించే దిశగా అడుగులు వేయాలని రాహుల్ గాంధీ పిలుపుమేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రిలో పేషెంట్స్ కు సహాయకులకు పాలు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు.

అదేవిధంగా పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. రాహుల్ గాంధీని మేమందరము ఆదర్శంగా తీసుకుంటామని, వారు ప్రతిక్షణం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే నాయకుడని, వారు అకుంఠిత దీక్షతో పాదయాత్రలు చేసి దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట నిలబెట్టారనన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి, గంధం రామకృష్ణ, జలంధర్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్, సికిందర్, పలువురు శీను అబ్దుల్లా విష్ణు, అనిల్, చక్రి, ఇరుగు మధు, అవుట శీను, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Miryalaguda: రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోతలు.. వేళలు ఇవే..!

Aadhar: ఆధార్ కార్డు ఉంటే కుట్టు మిషన్ ఉచితం.. ఈరోజే దరఖాస్తు చేసుకోండి..!