గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కు పాదం

గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కు పాదం

వెంకటాపురం , మనసాక్షి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామంలో సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల సమయంలో నాటు సారా తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

 

స్థానిక ఎస్సై కే తిరుపతి రావు తెలిపిన వివరాల ప్రకారం బెస్తగూడెం గ్రామంలో గణేష్ టెంపుల్ చుట్టుపక్కల ఇళ్లల్లో నాటు సారా తయారు చేస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని .

 

ఈ తనికిల్లో భాగంగా మాటూరు. వెంకటేశ్వర్లు, మాటూరి.పద్మ, తాండ్ర.బాబు, రామెల్ల.సతీష్, అక్కనపల్లి.సత్యనారాయణ అనే ఐదుగురి ఇళ్లల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న నాలుగు వేల లీటర్ల బెల్లం పానకం,ఎనిమిది లీటర్ల గుడుంబా, ప్లాస్టిక్ డ్రమ్ములు, స్టీల్ బిందెలు ఇతర పాత్రలును గడ్డపారలతో గ్రామస్తుల ముందే ధ్వంసం చేశారు.

 

తనికిల్లో పట్టుబడ్డ 100 కేజీల పటికిని సీజ్ చేశామని అన్నారు.ఈ మధ్య వెంకటాపురం మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ, నాయకులగూడెంలో జోరుగా గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయని యువత గుడుంబాకు బానిసై చాలామంది చనిపోతున్నారు.

 

మూడు నెలల క్రితం తన భర్త మద్యానికి బానిసై ఆరోగ్యం దెబ్బతిని చనిపోయాడని తల్లిదండ్రులు అత్తమామలు ఎవరు లేరని అండగా ఉంటాడు అనుకున్న ఒక్కగానొక్క అన్న నాగరాజు కూడా మద్యానికి బానిసై చావు బతకాల మధ్య ఉన్నాడని నాకు ఇద్దరు పిల్లలు వారిని ఎలా పెంచాలని ఎక్సైజ్ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారని అధికారులు పట్టించుకోకపోతే మేమే రోడ్డెక్కి ధర్నా చేస్తామని వావిలాల సమ్మక్క అనే మహిళ కన్నీరు మున్నిరుగా విలపిస్తూ ఆరోపించింది.

 

ఆ కథనానికి స్పందించిన వెంకటాపురం పోలీసులు ఈరోజు బెస్తగూడెంలో దాడులు నిర్వహించి గుడుంబా తయారు చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు