గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల మెరుపు దాడులు

గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసుల మెరుపు దాడులు

వెంకటాపురం , మనసాక్షి

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీరభద్రవరం గ్రామపంచాయతీలోని ముత్యం దార కు వెళ్లే దారి అటవీ వాగు ప్రాంతంలో నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం సాయంత్రం గుడుంబా తయారీ స్థావరాలపై ఎస్సై కే. తిరుపతిరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సుమారు 4000 బెల్లం పానకం ద్వంసం చేసి,300 కిలోల బెల్లం 50 కిలోల పటిక స్వాధీనం చేసుకోవడం జరిగింది.

 

ఐదుగురు అనుమానితులను అదుపులో కి తీసుకొని విచారిస్తున్నామని పట్టుబడిన వారి మీద తగు చర్యలు తీసుకొని ఎక్సైజ్ శాఖ కి అప్పగించడం జరుగుతుంది. తెలిపారు. మండలంలో ఎక్కడైనా నాటు సారా తయారుచేసిన అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు . ఈ దాడిలో ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.