Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

నల్గొండ : సీఎం కావాలని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడు

నల్గొండ : సీఎం కావాలని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడు, మీడియాతో గుత్తా చిట్ చాట్..!

నల్గొండ , మనసాక్షి :

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలి ఛైర్మన్ పదవిని ధర్మబద్ధంగా నిర్వహిస్తున్నాను, రాజ్యాంగ చట్టాలను అనుసరిస్తూ ,న్యాయ బద్దంగా చైర్మన్, స్పీకర్ స్థానాలకు న్యాయం చేస్తున్నామన్నారు.

 

బిజెపి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తనపైన ,అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పైన చేసిన వాక్యాలు అర్ధరహితమని, బండి సంజయ్ తీరు చూస్తే గురివింద గింజ సామెతను గుర్తు చేస్తుందన్నారు.

 

తన గురించి మాట్లాడే నైతిక హక్కు బండి సంజయ్ కు లేదని, గవర్నర్ పదవి కూడా నాన్ పొలిటికల్. గవర్నర్ పదవీ లో ఉన్నవాళ్లు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాలి. కానీ మన రాష్ట్రం సహా చాలా రాష్ట్రాల్లో గవర్నర్లు పొలిటికల్ గా వ్యవహరిస్తున్నారువ దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదన్నారు.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందారన్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో కేంద్ర ప్రభుత్వం ,ప్రధాని మోడీ ఘోరంగా విఫలమయ్యారని, ప్రజాసమస్యలపై మాట్లాడకుండా నిత్యం ప్రజల నడుమ విద్వేషాలు పెంచుతూ రాజకీయంగా లబ్ది పొందాలని బీజేపీ పార్టీ నేతలు చేస్తున్నారన్నారు.

 

తెలంగాణ లో కాంగ్రెస్, బిజెపి లు అధికారం లోకి వస్తే పాలన అంత ఢిల్లీ నుండి జరుగుతుంది. వాళ్లు పార్టీ కార్యవర్గం వేయాలన్న ఢీల్లీ వాళ్ళు నిర్ణయించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.

 

రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని పగటి కలలు కంటున్నాడు.తెలంగాణను దోచుకోవాలని ఎత్తుగడలు వేస్తున్నాడన్నారు. ప్రియాంకా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా పార్టీ నేతలను ఏకం చేయడానికే, ప్రజలకు ఓరిగేది ఏమిలేదని, కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి అస్సలు లేదన్నారు.

 

తక్కెడలో కప్పల లాగా రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి ఉందని, ప్రధాని మోదీ తన స్థాయిని మరిచి కర్నాటక ఎన్నికల్లో మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికల సభలో ప్రధాని మత నినాదాలు చేస్తున్నారని, కర్నాటక లో లౌకిక శక్తులు విజయం సాదించాలన్నదే మా కోరికన్నారు.

మరిన్ని వార్తలు