శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన హంపి పీఠాధిపతి
శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి
భూమి పూజ చేసిన హంపి పీఠాధిపతి
– పాల్గొన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
అర్వపల్లి , మనసాక్షి : సూర్యాపేట జిల్లా మండల పరిధిలోని కోడూరులో శుక్రవారం శంభు లింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హంపి పీఠాధిపతి శ్రీశ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భూమి పూజ లో పాల్గొన్నారు.
అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని సిసి రోడ్లకు 15 లక్షల రూపాయలను మంజూరు చేశారు. దేవాలయ నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలను విరాళం అందజేశారు. కోడూరు రహదారిపై బ్రిడ్జి లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలపగా బ్రిడ్జిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సామాఅభిషేక్ రెడ్డి , రవీందర్ రెడ్డి , వెంకట్ రెడ్డి, బ్రహ్మచారి, పాపయ్య గౌడ్, సోమయ్య ,మాజీ సర్పంచ్ సంఘ వెంకన్న, బాకీ మల్లయ్య , మాజీ ఎంపీటీసీ రసీదులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి
1. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కళ్యాణి
2. కుక్కను తప్పించబోయి… రోడ్డు ప్రమాదం
3. ప్రతి ఒక్కరికి వంద రోజుల ఉపాధి కల్పించాలి – జూలకంటి










