Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంక్రైంసూర్యాపేట జిల్లా

ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు యాదగిరి మృతి..!

ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు యాదగిరి మృతి..!

సూర్యాపేట , మనసాక్షి

ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ లో సహాయ సంచాలకులు గా హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న పిల్లుట్ల యాదగిరి అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను మృతి చెందారు.

యాదగిరి ఉద్యాన శాఖలో గత 30 సంవత్సరాలు గా ఉద్యాన అధికారిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసి ఈ ప్రాంత రైతులకు ఉద్యాన శాఖ ద్వారా విశిష్ట సేవలు అందించారు.ప్రస్తుతం హైదరాబాద్ లోని కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

ALSO READ : Car Driver : కారు డ్రైవర్ ఖాతాలో రూ. 9 వేల కోట్లు జమ.. ఒక్కసారిగా షాక్ అయిన డ్రైవర్..!

తన సర్వీసు లో రైతుల ,తోటి ఉద్యోగుల మన్ననలు పొందారు. అతని మృతి పట్ల సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి బి శ్రీధర్ గౌడ్ ,తో పాటు ఉద్యాన అధికారులు కన్న జగన్ ,స్రవంతి ,అనిత , కార్యాలయ సిబ్బంది మురళి ఝాన్సీ ,నరేష్ ,నరేందర్ తో పాటు ఆయిల్ పామ్ కంపెనీ సిబ్బంది రంగు ముత్యంరాజు ,భద్రాచలం , రాము ,అనిల్ ,సుధాకర్ రెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు