వరి కోత మిషన్లకు ధరల నిర్ణయం

వరి కోత మిషన్లకు ధరలు నిర్ణయించిన రైతులు

తుంగతుర్తి , అక్టోబర్ 26, మన సాక్షి : మండల పరిధిలోని వెంపటి గ్రామంలో వరి కోతకు సంబంధించి బుధవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వరి కోత సందర్భంగా యంత్రాల యజమానులు ఇష్టానుసారం ధరలు పెంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజా ప్రతినిధులు, రైతులు కలసి వరి కోత కు సంబంధించిన ధరను నిర్ణయించారు. వరి ధాన్యం కటింగ్ కు హార్వెస్టింగ్ మిషన్ ధరలు ఒక గంట కిరాయి చైన్ మిషన్ ధర రూ3000/- గా, ఫోర్ వీలర్ మిషన్ ధర రూ. 2500/- గా, టు వీలర్ మిషన్ ధర రూ. 1800/- గాను రైతులు చెల్లించేందుకు ఆమోదించారు.

ఇంతకంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ భాష బోయిన వెంకన్న ఎంపీటీసీ గుండ గాని వీరస్వామిగౌడ్, ఎఫ్ఎసిఎస్ డైరెక్టర్ పులుగుజ్జ యకయ్య, మాజీ సర్పంచ్ కొండగడుపుల నాగయ్య, గుండ గాని అంజయ్య, చిర్ర శ్రీను,గ్రామ వార్డు సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.