District collector : ధాన్యం కుప్పలు వెంటనే తూకం వేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : ధాన్యం కుప్పలు వెంటనే తూకం వేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని సిరికొండ బొమ్మెన గ్రామాలలో భీమారం మండలంలోని మన్నెగూడెం దమ్మన్నపేట వల్లంపల్లి గ్రామాలలో ఫ్యాక్స్ ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు. అలాగే ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు. సంబంధిత ఏఈఓ ను కేంద్రం ఏ విధంగా నడుస్తుంది అని తెలుసుకున్నారు.
ధాన్యము కుప్పలు మ్యాచర్ వచ్చిన వెంటనే తూకము వేసి రైస్ మిల్లకు తరలించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తేమ వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు వేగవంతంగా కొనుగోలు చెయ్యాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డిఓ జివాకర్ రెడ్డి, ఎమ్మార్వో వసంత , డిఆర్డిఓ, రఘు వరుణ్, జిల్లా పౌరసరఫల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా మేనేజర్ జితేందర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి కవల సోదరుడు ఉన్నాడని మీకు తెలుసా.. ఐతే తెలుసుకో..!
-
TG News : తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం..!
-
Viral Video : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. పేరెంట్స్ కు దొరికింది, ఎలానో చూస్తే నవ్వుకోవాల్సిందే.. (Video)
-
Gold Price : పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. తెలుగు వారిని ఒక్కరోజే మురిపించింది..!










