గుండెపోటు తో రైతు మృతి..!

ఓ రైతు పొలంలో యూరియా చల్లేందుకు వెళ్తుండుగా..గుండెనొప్పి రావటంతో అక్కడిక్కడే నుంచి పడి మృతి చెందాడు.

గుండెపోటు తో రైతు మృతి..!

నేలకొండపల్లి, మన సాక్షి

ఓ రైతు పొలంలో యూరియా చల్లేందుకు వెళ్తుండుగా..గుండెనొప్పి రావటంతో అక్కడిక్కడే నుంచి పడి మృతి చెందాడు. స్థానికుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని కోనాయిగూడెం గ్రామానికి చెందిన హుస్సేన్ (50) అనే రైతు మంగళవారం తన పొలంలో యూరియా చల్లేందుకు యూరియా కట్టలను బైక్ పై తీసుకెళ్తున్నాడు.

ఇంట్లో నుంచి కొద్ది దూరం వెళ్లగానే గుండెనొప్పి వచ్చింది. రహదారి పైనే కుప్పకూలిపోయాడు. స్థానికుల గమనించి 108 వాహనం కు సమాచారం అందించారు. వారు వచ్చి పరీక్ష చేశారు. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. రైతు మృతదేహాం ను పలువురు సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు -ప్రగాడ సానుభూతి ని తెలియజేశారు.