Suryapet : భారీగా బంగారం, వెండి పట్టివేత..!

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట మండల పరిధిలోని సోమవారం టేకుమట్ల బస్ స్టాప్ వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద సూర్యాపేట రూరల్ సీఐ వై .సురేందర్ రెడ్డి ,రూరల్ ఎస్సై ఐ .బాలు నాయక్ ఎస్ ఎస్ టీం ఆధ్వర్యంలోపోలీస్ శాఖ సిబ్బందితో ఉమ్మడిగా వాహనాలు తనిఖీ చేశారు.

Suryapet : భారీగా బంగారం, వెండి పట్టివేత..!

సూర్యాపేట రూరల్, మనసాక్షి:

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట మండల పరిధిలోని సోమవారం టేకుమట్ల బస్ స్టాప్ వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద సూర్యాపేట రూరల్ సీఐ వై .సురేందర్ రెడ్డి ,రూరల్ ఎస్సై ఐ .బాలు నాయక్ ఎస్ ఎస్ టీం ఆధ్వర్యంలోపోలీస్ శాఖ సిబ్బందితో ఉమ్మడిగా వాహనాలు తనిఖీ చేశారు.

హైదరాబాద్ వైపు నుండి ఖమ్మం వైపు వెళ్ళుచున్న టియస్.09.యుయి.2479 నెంబర్ గల బొలెరో వాహనంలో ఒక 1, 135 గ్రాముల బంగారం దాని విలువ 76 లక్షల 75 వేల 39 రూపాయలు కలదు అలాగే వెండి 17 కిలోల 009 గ్రాముల 500 మిల్లి గ్రాముల వెండి దాని విలువ 13 లక్షల 55, 990 రూపాయల విలువ బంగారం ,వెండి మొత్తం విలువ 90,31,038.00 గల వాటిని ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకెళుతుండగా పట్టుబట్టి చేసి ఎలక్షన్ అధికారులకు అప్పగించినదని సీఐ. వై .సురేందర్ రెడ్డితెలిపారు.

ALSO READ :