సాయం కోసం ఎదురుచూపు…

*బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకలు...*

సాయం కోసం ఎదురుచూపు…

*బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకలు…*

ఖమ్మం(తిరుమలాయపాలెం) మనసాక్షి ప్రతినిధి : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన యాతాకుల లక్ష్మినారాయణ,శారద దంపతులకి వివాహానంతరం భార్య శారద గర్భం దాల్చింది.
ప్రస్తుతం 8 నెలల గర్భిణీగా ఉన్న ఆమెకు ఆకస్మికంగా బిపి,ఆయాసం వచ్చి పరిస్థితి ఆందోళన కరంగా వుండగా ఖమ్మం నగరంలోని విశ్వాస్ హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు పరీక్షించి తల్లి,బిడ్డలకు ఇద్దరికీ ప్రమాదమని చెప్పి సిజెరియన్ ఆపరేషన్ చేయడంతో బాబు జన్మించాడు.
పూర్తి నెలలు నిండకుండానే జన్మించిన బాబు 1కేజీ 150 గ్రాముల బరువుతో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో సమీపంలోని జీవన రేఖ పిల్లల ఆస్పత్రిలో”ఇంక్యుబేటర్”సహాయంతో చికిత్స అందిస్తున్నారు.
రోజుకీ 30 వేల రూపాయలు ఖర్చు భరించలేక,బిడ్డ ప్రాణాలు దక్కించుకోవటానికి నిరుపేద దంపతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానవత్వం గల దాతలు సహృదయంతో స్పందించి ఆర్థిక సాయం అందించి పసి బిడ్డ ప్రాణాలు కాపాడాలని దీనంగా వేడుకుంటున్నారు.

ఫోన్ పే,గూగుల్ పే నంబర్:9121980717
యాతాకుల లక్ష్మి నారాయణ

బ్యాంక్ అకౌంట్ నంబర్
A/c No 73131623026
APGVB sublaid branch
IFSC code SBIN ORRAPGB