హైదరాబాద్ : అత్తారింటి వేధింపులకు అల్లుడు ఆత్మహత్య

హైదరాబాద్ : అత్తారింటి వేధింపులకు అల్లుడు ఆత్మహత్య

హైదరాబాద్ , మనసాక్షి :

అత్తారింటి వేధింపులకు అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులోని కుషాయిగూడలో చోటుచేసుకుంది. కుషాయిగూడ ఎస్ఐ షఫీ తెలిపిన వివరాల ప్రకారం… కుషాయిగూడ లోని పోచమ్మ గుడి సమీపంలో వెంకట్ రెడ్డి (38 )తల్లి, భార్య కళ్యాణి తో పాటు ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనోసాగిస్తున్నాడు.

 

ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తున్న వెంకట్ రెడ్డి తో కలిసి అతని తల్లి ఉండటం అతని భార్య, అత్తమామలకు ఇష్టం లేదు. దాంతో వేరే కాపురం పెట్టేందుకు నిత్యం వాళ్లు వేధించారు.

 

🟢 ఎక్కువమంది చదివిన వార్తలు..  మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి.. 👇

1. Dharani : ధరణి పోర్టల్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

2. మిర్యాలగూడ : డోర్నకల్ – మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

3. TSRTC : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రూట్లలో 10 శాతం రాయితీ..!

4. Metro : మెట్రో రైల్ లో బంపర్ ఆఫర్.. స్మార్ట్ కార్డులు..!

 

దాంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భార్య రెండు నెలల క్రితం పిల్లలను తీసుకొని తల్లిగారి ఊరైన వరంగల్ కు వెళ్ళింది. కాగా జూలై 2వ తేదీన తల్లిదండ్రులను తీసుకొని కళ్యాణి… భర్త ఇంటికి వచ్చి నానా హంగామా చేసింది. అత్తను వెంటనే ఇంటి నుంచి పంపించాలని పట్టుబట్టింది.

 

అంతేకాకుండా ఆస్తి అంతటిని పిల్లల పేరున రాయాలని ఒత్తిడి చేసింది . పరువు పోతుందని ఎంత చెప్పినా.. భార్య వినలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటరెడ్డి అదే రోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లి గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స బుధవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.