Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆదిలాబాద్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ

Inter Exams : ఇంటర్ విద్యార్థి ప్రాణం తీసిన నిమిషం నిబంధన..!

Inter Exams : ఇంటర్ విద్యార్థి ప్రాణం తీసిన నిమిషం నిబంధన..!

మన సాక్షి , ఆదిలాబాద్ :.

ఇంటర్మీడియట్ పరీక్షలో నిమిషం నిబంధన అమలు చేయడం వల్ల ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇంటర్మీడియట్ పరీక్షలో ఒక నిమిషం నిబంధన కారణంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని మాంగూర్ల గ్రామానికి చెందిన శివకుమార్ (19) ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వెళ్లడంతో పరీక్ష రాయలేదు.

బాధను ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్షమించు నాన్న.. అంటూ సూసైడ్ నోట్ రాసుకొని ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జిల్లా వ్యాప్తంగా విషాదం నెలకొన్నది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల లో పరీక్ష కేంద్రం ఉంది. వారం తొలి రోజు పరీక్ష రాయడానికి మూడు నిమిషాలు ఆలస్యంగా వెళ్ళాడు. దాంతో పరీక్షకు అనుమతించలేదు. దాంతో పరీక్ష రాయలేదని మనోవేదనతో తండ్రికి సూసైడ్ నోట్ రాసి జైనథ్ మండలం సాత్నాల ప్రాజెక్టు డ్యాం లోకి ఆత్మహత్య చేసుకున్నాడు.

గురువారం విద్యార్థి మృతదేహం లభించింది. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ రాసి ఉంది. విద్యార్థిచేతి వాచి, పెన్ను లభించాయి. తండ్రికి రాసిన సూసైడ్ నోట్ అందర్నీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం పరీక్ష కు హాజరయ్యేందుకు ఒక నిమిషం నిబంధన వల్లనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయారని పలు విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.

ALSO READ : Medaram : మేడారం హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం..!

మరిన్ని వార్తలు