రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

హైదరాబాద్, మనసాక్షి : టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు, ఇబ్రహీంపట్నం కు చెందిన టిఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన 300 మంది యువత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రేవంత్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తదితరులు ఉన్నారు.