Nalgonda : 13 న ఉమ్మడి నల్లగొండ జిల్లా చెస్ సెలక్షన్స్..!
Nalgonda : 13 న ఉమ్మడి నల్లగొండ జిల్లా చెస్ సెలక్షన్స్..!
సూర్యాపేట, మనసాక్షి :
ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్ 13 బాల, బాలికలకు చెస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, గండూరి కృపాకర్, ఎల్ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13 (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ సెలక్షన్స్ అండర్ 13 బాల, బాలికలకు స్థానిక (టి. టి. డి )కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ పోటీలలో గెలుపొందిన వారిని హైదరాబాద్ లో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు మరియు షీల్డ్స్,మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందిఇస్తామని మరియు ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి నల్లగొండ జిల్లా చదరంగం క్రీడాకారులు ఉపయోగించుకోవాలని వారు కోరారు. వివరాలకు ఎల్ సతీష్ కుమార్ కార్యదర్శి, చరవాణి నెం. 9394753343 సంప్రదించాలని తెలిపారు.
MOST READ :
-
TG News : తెలంగాణ మంత్రి మండలి కీలక తీర్మానం.. బీసీలకు 42% రిజర్వేషన్లు..!
-
Hareesh Rao : మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణ.. అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
-
New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన.. బిగ్ అప్డేట్..!
-
Nagarjuna Sagar : కృష్ణమ్మ పరవళ్ళు.. నాగార్జునసాగర్ కు జలకళ.. లేటెస్ట్ అప్డేట్..!









