సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలి

సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలి

కనగల్ , మన సాక్షి:

ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎంపీపీ కరీం పాషా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. శాఖల వారీగా అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు.

 

గ్రామాల్లో ఉన్న సమస్యలను సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వానాకాలం సీజన్ కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అంకితభావంతో పని చేయాలన్నారు. అనంతరం ఎంపీపీ చైర్మన్ గా మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.

 

అదేవిధంగా మండలానికి నూతనంగా వచ్చిన ఎస్ఐ అంతిరెడ్డిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఎలాంటి ప్రధాన తీర్మానాలు లేకుండానే మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది.

 

ALSO READ : 

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. PhonePe : ఫోన్ పే కస్టమర్లకు గుడ్ న్యూస్..  హెల్త్ ఇన్సూరెన్స్ రూ.950 లకే రూ. 5 లక్షల బెనిఫిట్..!

3. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

4. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

 

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి చిట్ల వెంకటేశం గౌడ్, ఎంపీడీవో సోమ సుందర్ రెడ్డి, తహసీల్దారు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ రామగిరి శ్రీధర్ రావు, పిఎసిఎస్ చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, డిఈ నాగయ్య, మండల వైద్యాధికారి వరూధిని, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదయ్య, సర్పంచుల పోరం మండల అధ్యక్షుడు కృష్ణయ్య, ఎంఈఓ రాములు,

 

ఏవో అమరేందర్ గౌడ్, సూపరింటెండెంట్ అల్తాఫ్ అహ్మద్, హెచ్ ఓ అనంతరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షఫీ, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, ఐకెపి ఎపిఎం నరహరి, అంగన్వాడి సూపర్వైజర్లు మంజుల, శ్రీలత, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.