పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం..!

పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం మొదటిరోజు మంగళవారం వివిధ దేవతా మాలధారణ స్వాములకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యముగా భావిస్తున్నానని సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య అన్నారు.

పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం..!

మాల ధారణ స్వాములకు అన్నదానం చేయడం సంతోషం

జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య

సూర్యాపేట , మనసాక్షి

పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం మొదటిరోజు మంగళవారం వివిధ దేవతా మాలధారణ స్వాములకు అన్నదానం చేయడం ఎంతో పుణ్యముగా భావిస్తున్నానని సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనర్సయ్య అన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో వివిధ దేవత మాల ధారణ స్వాములకు 45 రోజులపాటు ఐదు లక్షల రూపాయల సొంత వ్యయంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

పవిత్రమైన కార్తీక మాసంలో మాల ధారణ స్వాములు పవిత్రంగా భోజనం వండి వడ్డించడం అభినందనీయమన్నారు. మాల ధారణ స్వాములకు చేసే అన్నదానం ఎంతో సత్ఫలితాలనిస్తుందన్నారు. అయ్యప్ప మాలలు సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.

ALSO READ : బీఆర్ఎస్ కు భారీ షాక్.. నలుగురు సర్పంచులు రాజీనామా, కాంగ్రెస్ పార్టీలోకి చేరిక..!

అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అయ్యప్పస్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మీల వాసుదేవ్, అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షులు బెలిదే శ్రీనివాస్, కార్యదర్శి ఎలుగురి రాంబాబు, కోశాధికారి బచ్చు శ్రీనివాస్, పైడిమర్రి కేశవులు, నరేంద్రుని విద్యాసాగర్,

మట్టపల్లి రాధాకృష్ణ,భూపతి శ్రీనివాస్,గొట్టిముక్కల శ్రీనివాస్ రెడ్డి , జె పి టి గురుస్వామి, మిర్యాల సంపత్ మనసాని రామ్మూర్తి, మనసాని నాగేశ్వర్ రావు, మీలా వంశి,రాచకొండ శ్రీను, మంచాల రంగయ్య, భాస్కరాచారి, బజ్జూరి శ్రీనివాసు,నర్సిరెడ్డి,రాజేష్,గజ్జి ఉపేందర్, దేవరశేట్టి సత్యనారాయణ, జెటంగి రవికుమార్,తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Elections : ఎన్నికల్లో ఓటు వేస్తారా.. ఆ సెకండ్లే కీలకం.. ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!