వేములపల్లి : కేసిఆర్ , కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం
కేసిఆర్ , కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం
ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది
వేములపల్లి , మన సాక్షి :
వేములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఆదివారం సెంటర్ లో కేసిఆర్ , కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమడబోయిన అర్జున్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఎన్నో కలలుకన్న యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు కన్నా కలల్ని కాలరాసిందని మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి అన్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయం వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి వల్ల
ఒక్క కేసీఆర్, కేటీఆర్ వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అయింది చాలదా, నిరుద్యోగ యువత తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లను చదివించి హైదరాబాద్ కి పంపి వేల రూపాయలతో కోచింగులు ఇప్పిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. నిరుద్యోగ యువత ఎవరు కూడా అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉండి నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తుందని భరోసానిచ్చారు.
ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని, సిట్టింగ్ జడ్జితో ఈ కేసును విచారణ జరిపించాలని, పరీక్షలకు సిద్ధం అవుతున్న యువతకు 1 లక్ష రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి ఉపాధ్యక్షుడు రావు ఎల్లరెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య , ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పుట్టల శ్రీనివాస్ , కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తంగెళ్ల సత్తిరెడ్డి , మాజీ సర్పంచులు రేగటి రవీందర్ రెడ్డి , నాగవెల్లి మధు, మాజీ గ్రామ శాఖ పుట్టల పెద్ద వెంకన్న, కాంగ్రెస్ మండల నాయకులు పుట్టలకొమ్ము వెంకన్న , బుసిరెడ్డి వెంకటరెడ్డి , దైదాగిరి , శెట్టిపాలెం గ్రామ శాఖ పల్లె వెంకటయ్య , , హాజి, కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు పుట్టల జానయ్య , కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు అశోక్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు









