Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsరాజకీయంహైదరాబాద్

Kcr : కెసిఆర్ సంచలన నిర్ణయం.. బహిరంగ సభ తేదీ ఖరారు..!

Kcr : కెసిఆర్ సంచలన నిర్ణయం.. బహిరంగ సభ తేదీ ఖరారు..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) సంచలన నిర్ణయం తీసుకున్నారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ లో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో మరో ప్రజా పోరాటం రాబోతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ స్థాపించి 25 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై ఆయన చర్చించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటం చేయగల పార్టీ బీఆర్ఎస్ ఒకటేనని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై మరో పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2028 లో అధికారంలోకి వచ్చేది నూరు శాతం తామే అని, కాంగ్రెస్ పాలన వెనక్కి ప్రయాణిస్తుంది అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఏప్రిల్ 27వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేసిఆర్ ప్రకటన చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. దాంతో పాటు పార్టీలో వ్యవస్థ గత కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

ఆయా కమిటీలకు ఇన్చార్జిగా హరీష్ రావును నియమిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి జిల్లాలో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 10 న సమావేశం నిర్వహించి పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చించనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు.

■ MOST READ : 

  1. Smart Ration Cards : ATM సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు.. మహిళల పేరుతోనే ఆ జిల్లాల్లో పంపిణీ..!

  2. Holidays : ఈ నెలలోనే మళ్లీ వరుసగా రెండు రోజులు సెలవులు..!

  3. Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

  4. Phone : మీ ఫోన్ లోనే సింపుల్ సెట్టింగ్స్.. ఎవరూ చోరీ చేయలేరు, ఇలా చేస్తే చాలు..!

  5. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఆ రూట్లో ప్రయాణికులకు రాయితీ..!

మరిన్ని వార్తలు