తుంగతుర్తి : కేసీఆర్ తో సమానంగా పోరాటం చేశా.. కాంగ్రెస్ లో చేరుతా .. పిడమర్తి రవి కీలక వ్యాఖ్యలు..!

తుంగతుర్తి : కేసీఆర్ తో సమానంగా పోరాటం చేశా.. కాంగ్రెస్ లో చేరుతా .. పిడమర్తి రవి కీలక వ్యాఖ్యలు..!

తుంగతుర్తి , మనసాక్షి :

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమానంగా పోరాటం చేశానని బిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని తాను ఈనెల 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను తెలంగాణ ఉద్యమకారుడునని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాను ప్రత్యేక భూమిక పోషించానని అన్నారు .ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.

 

ALSO READ :

  1. Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. మూడేళ్ల పాటు మరో కొత్త పథకం.. రూ. 3.6 లక్షల కోట్లు కేటాయింపు
  2. Rythu Bandhu : రైతుబంధు జాబితాలో మీ పేరు ఉందా? డబ్బులు ఎకౌంట్ లో పడ్డాయో..? లేదో..? ఇలా చెక్ చేసుకోండి..!
  3. RBI : రూ. 2 వేల నోట్ల రద్దు పై ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
  4. PhonePe : ఫోన్ పే లో లోన్లు.. రూ.15 వేల నుంచి రు. 5 లక్షల వరకు..!
  5. Viral Video : మోటార్‌సైకిల్‌పై ప్రేమికుల విచిత్ర సంఘటన, రూ. 21 వేలు చలాన్ ( వీడియో వైరల్)

 

తాను మలిదశ తెలంగాణ ఉద్యమం నుండి వచ్చానని తనకు స్థానికుడు… స్థానికేతరుడనే సమస్య ఉండదని తాను ఎక్కడినుండి అయినా పోటీ చేయవచ్చునని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తాను పోటీ చేస్తే విజయం ఖాయమని అన్నారు.

 

అధిష్టానం తప్పక నిర్ణయం తీసుకుంటుందని త్వరలో తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పర్యటిస్తానని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి చెడే మహేందర్, ఇమ్మడి సుధాకర్, అనిల్, ఉప్పుల రాంబాబు, సైదులు, కలకోట్ల మల్లేష్, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.