కేసీఆర్ హయాంలో నే పల్లెల అభివృద్ధి

కేసీఆర్ హయాంలో నే పల్లెల అభివృద్ధి

మాడ్గులపల్లి, మనసాక్షి:

కేసీఆర్ హయాంలో నే పల్లెల అభివృద్ధి జరిగిందని ఉమ్మడి జిల్లా శాసన మండలి సభ్యులు మక్కెన కోటిరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండల పరిధిలోని కన్నెకల్ లో 10 లక్షల రూపాయల తో నిర్మించనున్న మట్టి రోడ్డును శనివారం ఆయన ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల్లో జరిగే అభివృద్ధి ని చూసి ప్రజలు మళ్ళీ కేసీఆర్ కే పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ మోసిన్ అలీ,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలుట్ల బాబయ్య,

 

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన్నెం రంజిత్ యాదవ్,పోకల రాజు,కాకునూరి వెంకన్న, కాటపల్లి వెంకన్న, పగిళ్ళ సైదులు, మహిళ మండల అధ్యక్షురాలు లక్ష్మీ ,రంజిత్,సండ్రాల నాగరాజు, తదితరులు ఉన్నారు.