Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

వేతనాలను పెంచాలని కలెక్టరేట్ ముందు ధర్నా

వేతనాలను పెంచాలని కలెక్టరేట్ ముందు ధర్నా

సూర్యాపేట, మనసాక్షి

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ కనీస వేతనాలను పెంచకుండా వెట్టి చాకిరి చేయించుకుంటూ శ్రమ దోపిడీకి కేసీఅర్ ప్రభుత్వం పాల్పడుతుందని తెలంగాణ కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గంట నాగయ్య అన్నారు.

అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఏవో శ్రీదేవి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గంట నాగయ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీ లలో కనీస వేతనాలు అమలు చేయకుండా నిర్లక్ష్య వహిస్తుందని తక్షణమే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 26 వేల రూపాయలకు పెంచాలని, పిఎఫ్, ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానన్న కేసీఆర్ ప్రభుత్వ హామీని కేజీబీవీ లలో కూడా అమలు చేయాలని వారిని పర్మినెంట్ చేయాలని కోరారు.

చట్టబద్ధ హక్కులు లేకుండా కార్మికులు పనిచేస్తున్నారని వీరికి భద్రతతో కూడిన హక్కులు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో పని భారం పడి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, అప్ గ్రేడ్ అయిన పాఠశాలలో అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.కె జి బి వి లలో కనీస వేతనాలు అమలు చేయడం లేదని దుర్మార్గమైన విధానమని విమర్శించారు. ఏఎన్ఎం లకు వారంలో మూడు రాత్రి డ్యూటీలు వేయడాన్ని రద్దు చేయాలని,2వ ఏ ఎం ఎం లను నియమించాలని, ప్రతి స్కూల్ కి ఒక వెహికల్ ని,హాస్టల్ కు ఫైర్ సేఫ్టీ నీ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తుందని వీరిని రెండో పౌరులుగా చూస్తున్నారని, ఇది తగదని, శ్రమకు తగిన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యుజిల్లా అధ్యక్షులు కామళ్ళ నవీన్, జిల్లా కమిటీ సభ్యులు కామల్ల శ్రీను, తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు జానీ బేగం, గీత, రాములమ్మ, లక్ష్మి, నాగమణి, మౌనిక, కలమ్మ, అరుణ, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు