ఖేడ్.. కాంగ్రెస్ కంచుకోట..!

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తుంది. ఇప్పటివరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరగగా మూడు కుటుంబాల వారే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 16 పర్యాయాల ఎన్నికల్లో 10 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.

ఖేడ్.. కాంగ్రెస్ కంచుకోట..!

♦️ 16 పర్యాయాలు ఎన్నికలు.. మూడు కుటుంబాల వారే ఎమ్మెల్యేలు.

♦️ 10 పర్యాయాలు కాంగ్రెస్ దే విజయం

Jaleel, kangti (Narayan Khed) : 

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలుస్తుంది. ఇప్పటివరకు 16 పర్యాయాలు ఎన్నికలు జరగగా మూడు కుటుంబాల వారే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 16 పర్యాయాల ఎన్నికల్లో 10 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు.

ఆ మూడు కుటుంబాల వారిదే హవా:

నారాయణఖేడ్ నియోజకవర్గం లో ఆ మూడు కుటుంబాల వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో ఆ కుటుంబాల చెందిన వ్యక్తులు పోటీలో నిలబడితే ప్రజల వారినే ఆదరిస్తున్నారు. అప్పారావు షెట్కార్, మహా రెడ్డి వెంకట్ రెడ్డి, పట్లోళ్ల కృష్ణారెడ్డి. ఆ మూడు కుటుంబాలకు సంబంధించిన వారే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ వచ్చారు.

ALSO READ : Munugodu Congress : మునుగోడు కాంగ్రెస్ లో కట్టప్పలు..?

ఎన్నికల్లో విజయం సాధించిన వారు:

1. 1952 – అప్పారావు శెట్కార్ (కాంగ్రెస్)
2. 1957-అప్పారావు శెట్కార్ (కాంగ్రెస్)
3. 1962- రామ్ చందర్ రావు,దేశ్ముఖ, (ఇండిపెండెంట్)
4. 1967 -శివరావు శెట్కార్ (కాంగ్రెస్ పార్టీ)
5. 1972 -మహా రెడ్డి వెంకట్ రెడ్డి, (ఇండిపెండెంట్)
6. 1978 -శివరావు శెట్కార్ (కాంగ్రెస్)
7. 1983- ఎం వెంకట్ రెడ్డి (ఇండిపెండెంట్)
8. 1985 – శివరావు శెట్కార్ (కాంగ్రెస్)
9. 1989 – పట్లోళ్ల కృష్ణారెడ్డి (కాంగ్రెస్)
10. 1994 – ఎం విజయ్ పాల్ రెడ్డి (టిడిపి)
11. 1999 – పట్లోళ్ల కృష్ణారెడ్డి (కాంగ్రెస్)
12. 2004 – సురేష్ కుమార్ శెట్కార్, (కాంగ్రెస్)
13. 2009 – పట్లోళ్ల కృష్ణారెడ్డి (కాంగ్రెస్)
14. 2014 – పట్లోళ్ల కృష్ణారెడ్డి (కాంగ్రెస్)
15. 2016 – మహా రెడ్డి భూపాల్ రెడ్డి (టిఆర్ఎస్)
16. 2018 – మహా రెడ్డి భూపాల్ రెడ్డి (టిఆర్ఎస్)

ALSO READ : IT Attacks : తెలంగాణలో ఎన్నికలవేళ ఐటీ దాడులు.. కాంగ్రెస్ నేతల్లో కలకలం..!

నారాయణఖేడ్ నియోజకవర్గం ఓటర్లు :

పురుషులు : 1,14,857

మహిళలు : 1,12,955

ఇతరులు: 8..

మొత్తం 2,27,820

ALSO READ : కమ్యూనిస్టులతో కటీఫ్.. ఇక మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థి అతడే..!

2023 ఎన్నికల్లో విజయం ఎవరిని వరించనుందో :

2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పటోళ్ల కృష్ణారెడ్డి విజయ సాధించగా ఆయన 2016లో అకాల మరణం చెందారు. దాంతో 2016లో ఉప ఎన్నికలు నిర్వహించారు. టిఆర్ఎస్ నుంచి మహా రెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు మహా రెడ్డి భూపాల్ రెడ్డి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ నుంచి పటోళ్ల కృష్ణారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి పోటీలో నిలిచారు. కాగా మహా రెడ్డి భూపాల్ రెడ్డి విజయం సాధించారు.

తిరిగి 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించడంతో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షట్కర్ పోటీ చేసి పాలయ్యారు. సురేష్ షెత్కర్ పై 58 వేల ఓట్ల మెజారిటీతో మహా రెడ్డి భూపాల్ రెడ్డి విజయం సాధించారు.

2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశావాహుల్లో మాజీ ఎమ్మెల్యే సురేష్ షెట్కార్, సంజీవరెడ్డి ఉన్నారు. బిజెపి అభ్యర్థిగా జనవాడే సంగప్ప అజిష్టానం ప్రకటించింది.

ALSO READ : జెండా మోసినోళ్లకు టికెట్లు ఇవ్వరా..!