రచ్చబండకు తరలి వెళ్ళిన కిసాన్ కాంగ్రెస్

రచ్చబండకు తరలి వెళ్ళిన కిసాన్ కాంగ్రెస్

మిర్యాలగూడ, మనసాక్షి: ధరణి పోర్టల్ రద్దు చేయాలని హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే రైతు రచ్చబండ కార్యక్రమానికి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కిసాన్ సెల్ నాయకులు భారీగా తరలి వెళ్లారు. ర్యాలీని కిసాన్ సెల్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి జండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్ వలన పట్టా పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులకు గురై రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రైతులకు పాసు పుస్తకాలు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పడుతుందన్నారు. ధరణి పోర్టల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ALSO READ : వ్యవసాయ బావిలో పడిన కారు, ఒకరు మృతి – latest news

కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు మైబెల్లి, డీసీసీ ఉపాధ్యక్షుడు రావు ఎల్లారెడ్డి, వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలి కాంతారెడ్డి, కిసాన్ మండల అధ్యక్షుడు తంగేళ్ల సత్తిరెడ్డి, ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పుట్టల శ్రీనివాస్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు బొంగర్ల వినోద్, శెట్టిపాలెం ఎంపీటీసీ పళ్ల వీరయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టల కృపయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు పుట్టల పెద్ద వెంకన్న, కాల్వపల్లి మాజీ ఎంపిటిసి తలకొప్పుల సైదులు, మండల కాంగ్రెస్ నాయకులు లింగయ్య, మిర్యాలగూడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుట్టల జాన్, మండల కిసాన్ కాంగ్రెస్ నాయకులు పుట్టల కొమ్ము వెంకన్న, పగడాల వెంకన్న, తంగేళ్ల సైదిరెడ్డి, ఇంద్రాచారి, సాకేతు తదితరులు పాల్గొన్నారు.