Nalgonda : కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కోమటిరెడ్డి..!

తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Nalgonda : కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కోమటిరెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి:

తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నల్గొండ జిల్లా కేంద్రంలోని ది నల్లగొండ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సమేతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన వెంట నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మంత్రితో పాటు కూతురు శ్రీనిధి రెడ్డి , అల్లుడు ప్రణవ్ పోలింగ్ బూత్ 108 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు .

ప్రజాస్వామ్యంలో *ఓటు* ప్రజల చేతిలో ఒక ఆయుధమని.. ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ దంపతులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి- చైతన్య, మేరేడి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?