Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయంహైదరాబాద్

Komati Reddy Venkat Reddy : చంద్రబాబు అరెస్ట్ పై కోమటిరెడ్డి సంచలన కామెంట్..!

Komati Reddy Venkat Reddy : చంద్రబాబు అరెస్ట్ పై కోమటిరెడ్డి సంచలన కామెంట్..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు అంశంపై ఆసక్తికరంగా కామెంట్ చేయడం చర్చనీయాంశమైంది.

చంద్రబాబు కేసులకు సంబంధించిన కథనాలు వార్తలు టీవీ చానల్స్ లో వస్తుంటే టీవీ ఆఫ్ చేస్తున్నానని అన్నారు. దానికి సంబంధించిన వార్తలు చదవడమే మానేశానని పేర్కొన్నారు . చంద్రబాబు అరెస్ట్పై తానేమి మాట్లాడదలచుకోలేదని.. అయినా ఆంధ్ర గురించి తనకెందుకంటూ విలేకరులు అడిగిన ప్రశ్నకు దాటవేసే ప్రయత్నం చేశారు. తమ దృష్టి ఎంత కేసీఆర్ ను సీఎం కూర్చునించి దించడమే అంటూ కోమటిరెడ్డి పేర్కొన్నారు.

ALSO READ : Bigg Boss : బిగ్ బాస్ హిస్టరీ లోనే తొలిసారిగా.. మరోసారి మినీ గ్రాండ్ ఎంట్రీ.. ఎవరెవరు వస్తున్నారంటే..!

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు . ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 నుంచి 85 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కేసీఆర్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు.

డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో లేదని. ఎంపీ టికెట్ అంశంపై పార్టీ అధిష్టానమే మాట్లాడుకుంటామని, పార్టీలో ఉన్న సమస్యలపై కూడా ఢిల్లీలో మాట్లాడుకుంటామని తెలిపారు . హరీష్ రావు పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ “హరీష్ బి ఆర్ ఎస్ లో ఏం జరుగుతుందో తెలుసుకో” అంటూ మంత్రికి హితువు చెప్పారు. కోట్ల రూపాయల టికెట్లు అమ్ముకోలేదా..? అని ప్రశ్నించారు.

ALSO READ : NBR FOUNDATION GOOD NEWS : నిరుద్యోగులకు ఎన్ బీ ఆర్ ఫౌండేషన్ గుడ్ న్యూస్.. అక్టోబర్ 4న మెగా జాబ్ మేళా..!

టికెట్లు అమ్ముకునే పరిస్థితి టిఆర్ఎస్ లోనే ఉందన్నారు . హరీష్ రావుకు దమ్ముంటే తన సవాల్ ని స్వీకరించాలని, తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు చేశారు. ఒకవేళ నిరూపించకపోతే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తారా ..? అని సవాల్ చేశారు.

టిఆర్ఎస్ పేరు మార్చుకున్నప్పుడే ఆ పార్టీ కథ ముగిసిందని, ఎవరైనా తెలంగాణ పేరును మార్చుకుంటారా..? తెలంగాణ పార్టీ అని చెప్పుకుంటూ తెలంగాణ పేరు మార్చుకున్నారని , పేరు మార్చుకున్న పార్టీ ఇతర రాష్ట్రాలు ఎందుకు పోటీ చేయడం లేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు.

ALSO READ : India book of the record : 30 సెకండ్ల లో 34 ప్రశ్నలకు సమాధానాలు.. ఇండియా బుక్ ఆఫ్ ది రికార్డులో స్థానం..!

మరిన్ని వార్తలు