Nagarjuna Sagar : సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కే ఆర్ ఎం బి చైర్మన్..!

నాగార్జునసాగర్ ప్రాజెక్టును సోమవారం కృష్ణానది యాజమాన్య బోర్డ్ చైర్మన్ అశోక్ గోయల్ సందర్శించి పరిశీలించారు

Nagarjuna Sagar : సాగర్ ప్రాజెక్టును సందర్శించిన కే ఆర్ ఎం బి చైర్మన్..!

నాగార్జునసాగర్ , మన సాక్షి :

నాగార్జునసాగర్ ప్రాజెక్టును సోమవారం కృష్ణానది యాజమాన్య బోర్డ్ చైర్మన్ అశోక్ గోయల్ సందర్శించి పరిశీలించారు. ఇటీవల కాలంలో నూతనముగా కె ఆర్ ఎం బి చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న అశోక్ గోయల్ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులపై అవగాహన కోసం ప్రధాన ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు .

దీనిలో భాగంగా సోమవారం నాడు నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించి పరిశీలించినట్లు తెలిపారు. కృష్ణానది రివర్ బోర్డ్ ఉన్నత అధికారులతో, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నత అధికారులతో మరియు జెన్కో అధికారులతో కలిసి ప్రధాన జల విద్యుత్ కేంద్రంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు .

అనంతరం నాగార్జునసాగర్ ప్రాజెక్టును లోని ప్రతి విభాగాన్ని సందర్శించి పరిశీలించారు. దీనిలో భాగంగా నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ ను, గ్యాలరీలను ,డ్యాం క్రైస్ట్ గేట్లను , స్పిల్ వే ను, ప్రధాన జల విద్యుత్ కేంద్రంను, కుడి కాలువ, ఎడమ కాలువలను సందర్శించి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులతో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వీరు బౌద్ధ వారసత్వ సంపద నిలయమైన బుద్ధవనంను సందర్శించారు.

వీరితోపాటు కే ఆర్ ఎం బి సభ్యులు సంకువ ,కె ఆర్ ఎం బి సూపర్డెంట్ ఇంజనీర్ వరలక్ష్మి దేవి, డి ఈ అజయ్ యాదవ్, ఏఈ రాజేష్ చారి, నాగార్జునసాగర్ డ్యాం ఎస్ .ఈ .నాగేశ్వరరావు, ఈ. ఈ .మల్లికార్జున రావు, డి ఈ శ్రీనివాస్ రావు, ఏ ఈ లు కృష్ణయ్య , సత్యనారాయణ తదితరులు ఉన్నారు.