Recruitment : ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది అందుకేనా..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయడంతో పాటు ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగాల జాతరను ప్రారంభించారు.

Recruitment : ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చింది అందుకేనా..!

ప్రజా పాలనలో ఉద్యోగాల జాతర.. 6956 స్టాఫ్ నర్స్ లకు ఉద్యోగ పత్రాలు..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయడంతో పాటు ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగాల జాతరను ప్రారంభించారు.

ప్రజా పాలనలో ఆరోగ్యానికి అమలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 6956 మంది స్టాఫ్ నర్స్ లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. స్థానిక ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

ALSO READ : Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!

ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రి మట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి , కొండ సురేఖ , పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నారు. త్వరలో అన్ని ఖాళీలను కూడా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.

ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్స్ లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడానికి ప్రత్యేకత ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, నిరుద్యోగుల ఆశయాలు నెరవేర్చుతామన్నారు.

ALSO READ : Kumari aunty : ఫేమస్ అయిన కుమారి ఆంటీ.. ఆమె ఫుడ్ స్టాల్ పై సీఎం రేవంత్ రెడ్డి జారీ చేసిన ఆదేశాలేంటి.!

ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేశారని అన్నారు. నియామక పత్రాలు అందజేస్తున్న ఫోటోలు, వీడియోలను కెసిఆర్, హరీష్ రావుకు పంపాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు కానీ కెసిఆర్ తన కూతురు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఇచ్చాడని అన్నారు.