BREAKING : డ్రగ్స్ పక్కన పెట్టు.. జీవితాన్ని గాడిలో పెట్టు, నల్లగొండలో భారీ ర్యాలీ..!

ప్రపంచ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదకద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది.

BREAKING : డ్రగ్స్ పక్కన పెట్టు.. జీవితాన్ని గాడిలో పెట్టు, నల్లగొండలో భారీ ర్యాలీ..!

నల్లగొండ , మనసాక్షి :

ప్రపంచ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో మాదకద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులు, లైన్స్ క్లబ్, వాకర్స్ అసోసియేషన్, డాక్టర్స్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, 12 బెటాలియన్ పోలీసులు, పి ఈ టి అసోసియేషన్ సభ్యులతోపాటు, నల్గొండ పట్టణ పుర ప్రముఖులు, జిల్లా పరిషత్, ఐసిడిఎస్, డి ఆర్ డి ఏ, గిరిజన అభివృద్ధి శాఖ లకు చెందిన అధికారులు, సిబ్బందితో నిర్వహించిన ఈ ర్యాలీ “డ్రగ్స్ ను నిర్మూలిద్దాం యువతను కాపాడుదాం “… “డ్రగ్స్ వద్దు జీవితం వద్దు “…. “డ్రగ్స్ ను పక్కన పెట్టు జీవితాన్ని గాడిలో పెట్టు”… అని నినాదాలతో సాగింది.

క్లాక్ టవర్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, మనిషి జీవితంలో 15 నుండి 35 సంవత్సరాల లోపు వయసు చాలా ముఖ్యమైనదని, జీవితాన్ని మలుచుకునే ఈ వయసులో మాదకద్రవ్యాలకు బానిస కావటం వల్ల జీవితం నాశనం అవుతుందని అన్నారు.  ఆలోచన మందగించే ఏదైనా విషంతో సమానమని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యువత మాదకద్రవ్యాలకు అలవాటు కావద్దని, ఒకవేళ వాటికి బానిస అవుతే జీవితానికి అర్థమే ఉండదని అన్నారు.

యువత కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు .జిల్లాలో మత్తుమందులు అన్నవి కనపడకూడదని చెప్పారు. ఇందుకుగానుఅన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నల్గొండ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత తీరికలేని జీవితంలో తమ పిల్లలు ఏం చేస్తున్నారు ?ఎక్కడ తిరుగుతున్నారనే విషయాలపై తల్లిదండ్రులు శుద్ధ చూపడం లేదని, దీంతో కొన్ని మాధ్యమాల ద్వారా పిల్లలు చెడు వైపుకు వెళ్తూ మత్తుకు బానిస అవుతున్నారని, పిల్లలు ఏం చేస్తున్నారో రోజువారి పరిశీలన చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పై ఉందని గుర్తు చేశారు.

పిల్లలు మత్తుకు బానిస కాకుండా మొదట తల్లిదండ్రుల్లో అవగాహనరావాలని అన్నారు. పర్యవేక్షణచేయకపోవడం వల్లే పిల్లలు చెడు వైపు చూస్తున్నారని, అన్నారు.జిల్లా ఎస్పి మాట్లాడుతూ, యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృథా చేసుకోకూడదని, ఒక్కసారి డ్రగ్స్ వాడినా సరే అది మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, తమ దృష్టికి వచ్చే నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. నిషేధిత డ్రగ్స్ వాడడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు,ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజం కోసం పోలీసు శాఖ, యువత మరియు సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిషేధిత మత్తుపదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదని, డ్రగ్స్ వినియోగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని, తెలిసీ తెలియక మత్తుపదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందని, యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తుపదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ రవాణా మరియు వినియోగాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎవరైన గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నంబర్ 8712671111 కి సమాచారం తెలపాలని కోరారు. వారిపై NDPS చట్టం-1985 తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ దీప్తి, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎస్బి డిఎస్పి రమేష్, నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి ,ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు, విశ్రాంత ఐ ఏ ఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్, జెడ్పి సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, గిరిజన అభివృద్ధి శాఖ అధికారి రాజ్ కుమార్, ఐసిడిఎస్ పిడి సక్కుబాయి, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ అమరెందర్ రెడ్డి,లయన్స్ క్లబ్ చైర్మన్ కె.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Whatsspp : వాట్సాప్ లో అదిరిపోయే మెటా ఏఐ ఫీచర్.. తెలియని విషయాలు సెకండ్లలో తెలుసుకోవచ్చు..!

Telangana : ఆగస్టు 1నుంచి భూములకు కొత్త రేట్లు.. ఎకరా ధర ఎంతంటే..?

Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికల చిచ్చు.. తెలంగాణలో ఏం జరుగుతోంది..!