Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

MLA ParnikaReddy : అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం.. ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి..!

MLA ParnikaReddy : అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం.. ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

భారతరత్న బాబా సాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడమేనని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి అన్నారు. సోమవారం డా. బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

అనంతరం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలన్నారు.

ఆధునిక భారత సమాజ నిర్మాణానికి అంబేద్కర్ పునాదులు వేశారని కొనియాడారు. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని సాధించుకుందామని ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకిత భావంతో మనమందరం కృషి చేద్దామని, వెనకబడిన కులాల నుండి న్యాయవాది అయిన మొదటి వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు.

అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు.సీఎం రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేయాలని అంబేద్కర్ స్పూర్తితో ముందుకు సాగుతున్నారని, ఇటీవలే నిర్వహించిన కుల గణన నిర్వహించారని, అలాగే అంబేద్కర్ నాలెడ్జి సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే నేడు తాము రాజకీయ పదవులను అనుభవిస్తున్నామని ఆమె చెప్పారు. నియోజక వర్గంలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతాదయాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, సమానత్వం కోసం అంబేద్కర్ రాజ్యాంగం రచించారని ఆయన చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో భాగంగా కులాంతర వివాహం చేసుకున్న ఇద్దరు దంపతులకు ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు..

అంతకు ముందు జిల్లా అదనపు కలెక్టర్లు బెన్ షాలోమ్, సంచిత్ గ్యాంగ్వర్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్, ఆర్టీవో మెంబర్ పోషల్ రాజేష్, మార్కెట్ చైర్మన్ సదాశివ రెడ్డి, వైస్ చైర్మన్ కొనoగేరి హనుమంతు, డీఎస్పీ నల్లపు లింగయ్య, సీ ఐ శివ శంకర్, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఉమా పతి,

బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్ఓ ఎం. ఏ. రషీద్, వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, మాజీ మార్కెట్ చైర్మన్లు బండి వేణు గోపాల్, సరాఫ్ నాగరాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు సలీం, మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు శరణప్ప, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 55,418 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశం..!

  2. Gold Price : పసిడి ప్రియులకు కాస్త ఊరట.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర..!

  3. Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

  4. Rice : అన్నం ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.!

మరిన్ని వార్తలు