Nalgonda : లైసెన్సు ఆయుదాలు వెంటనే డిపాజిట్ చేయాలి..!
Nalgonda : లైసెన్సు ఆయుదాలు వెంటనే డిపాజిట్ చేయాలి..!
జిల్లా యస్పి చందనా దీప్తి .
నల్లగొండ, మనసాక్షి.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ విడుదలైన నేపథ్యంలో నల్లగొండ జిల్లా పరిధిలోని మొత్తం 136 ఆయుదాలకు లైసెన్స్ లు కలిగి ఉన్నాయని వాటిని వెంటనే సమీప పోలీసు స్టేషన్లో లేదా జిల్లా పోలీసు కార్యాలయంలో డిపాజిట్ చేయాలని జిల్లా యస్పి ఆదేశాలు జారీచేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కాబట్టి ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం.. లైసెన్స్ ఆయుధాలు కలిగి ఉన్నవారు వెంటనే డిపాజిట్ చేయాలని, అలా చేయని వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని ఒక ప్రకటనలో తెలిపారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తీసుకోవచ్చని సూచించారు. ఈ విషయంలో జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు.
MOST READ :
Hareesh Rao Pa Arrest : హారీష్ రావు పిఏ అరెస్ట్..!
Nalgonda : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..!
BIG BREAKING : ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా..!
Telangana : రుణమాఫీ హామీపై నాడు, నేడు అంటూ కేటీఆర్ ట్వీట్..!









