Nalgonda : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..!

కట్టంగూరు గ్రామానికి చెందిన వనం ఈశ్వర్ ను ఈనెల 17న తిప్పర్తి మండలం అని శెట్టి దుప్పలపల్లి గ్రామ శివారులో కాళ్లు చేతులు కట్టేసి చంపి వ్యవసాయ బావిలో పడేసిన సంఘటన పోలీసులు కేసును సేధించి ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి శివరామరెడ్డి వివరాలు వెల్లడించారు.

Nalgonda : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య..!

ప్రియుడు, కిరాయు హాంతకులతో కలిసి హతమార్చిన భార్య

భార్యతో పాటు నలుగురు నిందితులు అరెస్ట్

వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి

నల్గొండ, మన సాక్షి:

కట్టంగూరు గ్రామానికి చెందిన వనం ఈశ్వర్ ను ఈనెల 17న తిప్పర్తి మండలం అని శెట్టి దుప్పలపల్లి గ్రామ శివారులో కాళ్లు చేతులు కట్టేసి చంపి వ్యవసాయ బావిలో పడేసిన సంఘటన పోలీసులు కేసును సేధించి ఆదివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి శివరామరెడ్డి వివరాలు వెల్లడించారు. 2015 సం.రంలొ మృతడు అయిన వనం ఈశ్వర్ టేకుమట్ల గ్రామం సూర్యాపేట మండలంనకు చెందిన దాసరి ఎల్లయ్య కూతురు నేరస్థురాలు అయిన నవ్య తో కుల పెద్దల సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది.

వారికి ఒక పాప 4 సం.లు, ఒక బాబు 2 సం.రాలు, సంతానం కలిగినారు.గతంలో భార్యా భర్త ల మద్య తరుచూ గొడవలు జరిగేవి, ఇట్టి విషయంలో పెద్దమనుష్యులు పంచాయతీ కూడ చేసిన తరువాత కొన్ని రోజులు మంచిగానే ఉన్నారు.ఇదే క్రమంలో తన ఇంటి ప్రక్కన వైన్స్ షాపులో పని చేసేటువంటి ఏ-2: కానుగు సతీష్ తో నవ్యకు పరిచయం ఏర్పడి, అక్రమ సంబండానికి దారి తీసినది.ఈ విషయం కొద్ది రోజుల తరువాత నవ్య భర్త మృతుడు కు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతుండేవి.

నవ్య అక్రమ సంభందం మనసులో పెట్టుకుని ఈశ్వర్ నవ్య తరచుగా కొట్టడం,దానికి తోడు నవ్య-సతీష్ లు వారి అక్రమ సంబందాన్ని మానుకోలేకపోవడం,నవ్య, తన ప్రియుడు అయిన సతీష్ తో తమ మద్య అక్రమ సంబంధం కొనసాగాలంటే తన భర్తను ఎలాగైనా చంపమని ప్రియుడు సతీష్ తో చెప్పగా నువ్వు బాధపడకు ని భర్తని చంపి మన మద్య అడ్డు తోలిగించుకుందాం అని ఆమెతో చెప్పాడు. తన భర్త ను చంపడానికి ఎవరినైనా డబ్బులకు మాట్లాడుకో అని చెప్పినది. ప్రియుడి దూరపు బంధువు ఏ -3నక్క వీరాస్వామి అశోక్ లేలాండ్ గూడ్స్ బండిపై డ్రైవరు.

ALSO READ: Telangana : తెలంగాణలో ఘోరం.. కన్న కొడుకుని కడతేర్చిన తల్లి..!

అతనితో అప్పుడప్పుడు ఆమె ప్రియుడు బండిపై వెళ్ళేవాడు, అందాజ 15 రోజుల క్రితం తన అక్రమ సంబంధం గురించి చెప్పి ఎలాగైనా నవ్య భర్త అయిన ఈశ్వర్ ను చంపి వారి మద్య అడ్డు తొలగించుకోవాలి అనుకుంటున్నా విషయం చెప్పాడు. చంపడానికి నక్క వీర స్వామి ఒప్పుకుని, తనకు తెలిసిన వారితో కలిసి చంపుటకు రెండు లక్షల రూపాయలు ఒప్పందం చేసుకున్నాడు. భర్తను హత్య చేయడానికి తన రెండు తులాల బంగారపు తాడును సతీష్ కు ఇచ్చినది.

డ్రైవర్ వీరస్వామికి తెలీసిన ఏ -4 ధనవత్ హనుమా నాయక్, ఏ -5 ధనావత్ సాయి లతో ఈశ్వర్ ను చంపే విషయం చెప్పి అందుకు తనకు సహాయం చేయమని చెప్పగా, వారు ఒప్పుకొనగ వారితో, ఈశ్వర్ ను చంపుటకు 40,000/-రూ,,లకు ఒప్పందం చేసుకున్నాడు.

ఈశ్వర్ హత్య ఇలా : 

మృతుని పరిచయం చేసుకోవడానికి ఈనెల 16 న ఉదయం 9 గంటల సమయంలో నక్క వీరస్వామి బస్ ఎక్కి కట్టంగూర్ వచ్చి కలిమెరా రోడ్డు సెంటర్ సతీష్ ను కలిసి,ఈశ్వర్ గురించి వేచి చూస్తుండగా, ఇంతలో ఈశ్వర్ తన భార్యా పిల్లలతో కలసి తన బండిపై టేకుమట్ల వెల్లుచుండగా వీరాస్వామి,కానుగు సతీష్ లు బండిపై వెనకాల వెళ్ళినారు, నకిరేకల్ దాటిన తరువాత ఈశ్వర్ బండి ఆగిపోవడంతో నవ్యను తన పిల్లలతో సహ ఆటో లో పంపినాడు. వెనకాల వస్తున్న నిందితులు దూరంగా దించి హత్య చేయ వాలసినది అతడినే అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయినాడు.

ALSO READ : Nalgonda : బైక్ పై నుంచి కిందపడి దుర్మరణం..!

వెంటనే నక్క వీర స్వామి, ఈశ్వర్ దగ్గరకు వెళ్ళి, అతని బండి బాగు చేయుటకు సహాయపడి పరిచయం పెంచుకుని, ఈశ్వర్ ను నకిరేకల్ లో వైన్స్ లో బీర్ తాపించి మాయమాటలు స్నేహం చేసుకొని ఈశ్వర్ ఫోన్ నంబర్ తీసుకున్నాడు, ఆ రోజూ రాత్రి ఈశ్వర్ తన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు.తరువాత సతీష్,నక్క వీరస్వామి కలిసి కట్టంగూర్ లోనే పడుకుని కారులో ఈశ్వర్ ను ఎక్కడికైనా తీసుకోవెళ్ళి గొంతు పీసీకి లేదా తాడుతో మెడ చుట్టూ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపి ఎక్కడైనా బావిలో పడవేడ్డం అని పథకం వేసుకున్నారు.

ఈనెల 17న సూర్య పేటకు వెళ్ళి టీఎస్ -05- ఈ ఎస్ -4687 నంబర్ గల కారును కిరాయికి తీసుని కట్టంగూర్ వచ్చి, వీర స్వామి, మృతునికి ఫోన్ చేసి కారులో నల్గొండ వరకు వెళ్దాం రమ్మని పిలవడంతో ఉదయం అందాజ 11 గంటల సమయంలో మృతుడు కారులో ఎక్కించుకొని నకిరేకల్ మీదుగా నల్గొండకు వెళ్ళినాడు. ముందుగానే స్నేహితులు అయిన ధనవత్ హనుమా నాయక్, ధనావత్ సాయి అనువారిని బస్సులో నల్గొండ రమ్మని చెప్పి. వీరాస్వామి మృతుణ్ణి తీసుకొని కారులో నల్గొండ వచ్చి బస్ స్టాండ్ దగ్గర ధనవత్ హనుమా నాయక్, ధనావత్ సాయి కలిసి, వారిని కారులో ఎక్కించుకుని,

మృతుణ్ణి, నల్లగొండ నుండి కట్టంగూర్ రోడ్డులో తీసుకోవెల్లుచు మార్గమద్యంలో అందాజ 1.30 గంటల సమయంలో దండెమ్ పల్లి గ్రామ శివారులో వచ్చేసరికి ముందు కూర్చున్న మృతుడి మెడకు వెనుక సీటులో కూర్చున్న ధనవత్ హనుమా నాయక్, ధనావత్ సాయి లు ముందుగానే తమతో పాటు తెచ్చుకున్న పూరికోసా తాడు వెనకాల ఈశ్వర్ మెడకు గట్టగా బిగించి, ఊపిరాడకుండా చేసి, మృతుని చంపి, శవాన్ని ఎవరికి అనుమానం రాకుండా మద్యాహ్నం 2.30 గంటల సమయంలో అదే కారులో ముగ్గురు కలిసి మృతుడి శవాన్నిఅనిశెట్టి దుప్పలపల్లి దగ్గర బావి వద్దకు తీసుకోవెళ్ళి వ్యవసాయ బావిలో పడేశారు.

నేరస్థుల వద్దనుండి ఒక కారు, 2 తులాల బంగారు గొలుసు, రెండు మోటార్ సైకిల్ లు ,20 వేల నగదు,5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన శాలిగౌరారం ఎస్సై సి. శ్రీనివాస్ రెడ్డి,తిప్పర్తి యస్.ఐ రాజు, సిబ్బంది ముజీబ్, రాజీవ్, సురేశ్, ఖలీల్ లను డిఎస్పీ అభినందించారు.

ALSO READ : Murder : ఇద్దరు చిన్నారుల హత్య.. నిందితుడు ఎన్ కౌంటర్..!