లింగంపల్లి : రైల్వే అండర్ పాస్ కు ముంపు సమస్య

లింగంపల్లి : రైల్వే అండర్ పాస్ కు ముంపు సమస్య

శేరిలింగంపల్లి , మన సాక్షి :

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని లింగంపల్లి డివిజన్ రైల్వే అండర్ పాస్ ముంపుకు గురైయింది. గత మూడు రోజుల నుండి నిరంతరంగా కురుస్తున్న వర్షాలకు లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరింది. విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి బీజేపీ నాయకుల  గజ్జల యోగానంద్ అక్కడికి చేరుకొని ప్రాంతాన్ని స్థానికులతో  కలిసి పరిశీలించారు.

 

ఈ సందర్బంగా యోగానంద్ మాట్లాడుతూ , హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ ఎస్ ప్రభుత్వం, కనీసం రోడ్లు , డ్రైనేజీ వ్యవస్థ అసెంబ్లీ పరిధిలో ఏర్పాటు చేయలేక పోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని, లింగంపల్లి వంతెన సమస్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని, నీటి మట్టం దాదాపు 4 అడుగులకు చేరుకోవడంతో ప్రయాణికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి నీటిలో నడవాల్సి వస్తోందని యోగానంద్ తెలిపారు.

 

స్థానిక గోపి చెరువు చాల భాగం ఆక్రమణలకు గురి కావడం వల్ల చెరువులోకి వెళ్ళవలసిన నీరు రోడ్ల పైకి వచ్చి అండర్ పాస్ ముంపుకు గురికావడం, వాహనాల రాక పోకలు స్థంభించిపోవడం వల్ల ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురికావడం, వారి రోజు వారి ఆదాయానికి గండిపడడం బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

2. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

3. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

4. Godavari : గోదావరి తీరంలో హెచ్చరిక బోర్టులు

 

 

డ్రైనీజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే రైల్వే బ్రిడ్జి కిందకు వరద నీరు చేరిందని, ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి కనిపిస్తున్నా, బ్రిడ్జి కిందకు వరద నీరు చేరకుండా శాశ్వత పరిష్కారం చూపించలేని స్థానిక కార్పొరేటర్ , ఎమ్ఎల్ఏ అధికారులు ఎం చేస్తున్నారని యోగానంద్ ప్రశ్నించారు .

 

అదే విధంగా చందానగర్ ఎమ్ఎమ్టీఎస్ రైల్వే స్టేషన్ వద్ద, పాపిరెడ్డి కాలనీ నుండి హుడా కాలనీ, మదీనాగూడ వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జి పరిస్థితి కూడా అద్వానంగా ఉందని, చిన్న పాటి వర్షానికే సగానికి పైగా నీరు నిండి పోతుందని, నెలల తరబడి నిలిచిపోయిన నీరును బయటకు తీయడానికి సరైన పంపింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.

 

శాశ్వత పరిష్కారం చూపించాలని లేకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, సమస్య పరిష్కారం కాకపోతే బీజేపీ పార్టీ తరఫున పోరాటం చేపడతాం అని యోగానంద్ హెచ్చరించారు. రైల్వే అండర్ ప్రాసెస్ పర్యటన అనంతరం ముంపునకు గురయిన పలు ప్రాంతాలను సందర్శించిన యోగానంద్ రోడ్లు గుంతలమయం కావడం, మియాపూర్ నుండి భేల్ వరకు ఉన్న రోడ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు.