Godavari : గోదావరి తీరంలో హెచ్చరిక బోర్టులు

మండల ప్రత్యేక అధికారి తుల రవి

Godavari : గోదావరి తీరంలో హెచ్చరిక బోర్టులు

మండల ప్రత్యేక అధికారి తుల రవి

మంగపేట , మన సాక్షి

అకినేపల్లి మల్లారం గోదావరి తీరం వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డును ఏర్పాటు చేస్తున్న అధికారులు
అకినేపల్లిమల్లారం గోదావరి తీరం వద్ద ప్రమాద హెచ్చరికల బోర్డును ఏర్పాటు చేస్తున్న అధికారులు. మంగపేట మండలంలోని కమలాపురం, మంగపేట, కత్తిగూడెం, చుంచుపల్లి, అకినేపల్లి మల్లారం గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు మండల ప్రత్యేక అధికారి తుల రవి, తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు.

 

> ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. TSRTC : పల్లె వెలుగు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. బస్సు పాస్ ల అమలుకు నిర్ణయం..!

3. TSRTC : ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్యాకేజీ.. 22 నుంచి ప్రారంభం..!

 

గురువారం ఎస్సై తహెర్ బాబా, ఇంచార్జ్ ఎంపీడీఓ పి.శ్రీనివాస్ లతో కలిసి ఆయా గోదావరి పరివాహక ప్రాంతాలను సందర్శించి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. గోదావరి ఎగువన ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత, కాళేశ్వరంల నుండి వరద ఉదృతి ఎక్కువగా ఉండడంతో గోదావరి ప్రవాహం పెరిగి

 

మండలంలోని కమలాపురం, మంగపేట(పొద్మూరు), చుంచుపల్లి, కత్తిగూడెం, అకినపల్లి మల్లారం గ్రామాలలోని లోతట్టు ప్రాంతాలకు వరదనీరు చేరే అవకాశం ఉన్నందున ఆయా గ్రామాలకు చెందిన అధికారులు స్థానిక రాజకీయ నాయకుల సహాయంతో ప్రజలకు సహాయ చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉండాలని కోరారు.

 

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి గ్రామపంచాయితీ కార్యదర్శుల సహాయంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరదల నుండి తమను తాము రక్షించుకునేందుకు అవసరమయ్యే టార్చిలైట్లు, త్రాడ్లు, ఖాళి ట్యూబ్ లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.

 

ఎక్కువమంది చదివిన వార్తలు.. మీరు కూడా చదివేందుకు క్లిక్ చేయండి..👇

1. WhatsApp Tips : మీ వాట్సాప్ లో మెసేజ్ మీకు తెలియకుండా ఎవరైనా చదువుతున్నారా..? తెలుసుకోండి ఇలా..!

2. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

3. Runa Mafi : తెలంగాణలో రైతుల పంట రుణాలు మాఫీ.. ఎప్పుడంటే..!