వేములపల్లి : లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తా

వేములపల్లి : లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తా

వేములపల్లి , మన సాక్షి :

లారీ టైరు పగిలి ట్రాక్టర్ను ఢీకొట్టగా ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన వేములపల్లి మండల కేంద్రంలోని అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది.

 

స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన పుట్టల లక్ ప్రకాష్ తన ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ బేరింగ్ మరమ్మతులకు గురికావడంతో అట్టి ట్రాక్టర్ ను డ్రైవర్ చిట్టి మల్ల వెంకన్న మెకానిక్ వద్దకు తీసుకొని బయలుదేరాడు.

 

ALSO READ :

1. మిర్యాలగూడ : నాగార్జునసాగర్ జలాశయంలో సాగుకు నీరుందా..? ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడో..?

2. Eamcet Counseling : తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు.. రిపోర్టు ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం..!

 

మండల కేంద్రంలోని మసీదుకు సమీపంలోకి రాగా అదే సమయంలో ట్రాక్టర్ వెనుక నుంచి వస్తున్న లారీ టైరు పగిలి అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టగా ట్రాక్టర్ తిరగబడింది. ట్రాక్టర్ కింద ఉన్న డ్రైవర్ను బయటికి తీయడంతో గా యాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు