TOP STORIESBreaking Newsజాతీయం
LPG : మరోసారి పెరిగిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచే అమలు..!
వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పిజి వంట గ్యాస్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెరిగిన రేట్ల ప్రకారం ఆయిల్ కంపెనీలు సోమవారం (జూన్ 1వ తేదీ) నుంచి కొత్త రేట్లు అమలు చేస్తున్నాయి.

LPG : మరోసారి పెరిగిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచే అమలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పిజి వంట గ్యాస్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెరిగిన రేట్ల ప్రకారం ఆయిల్ కంపెనీలు సోమవారం (జూన్ 1వ తేదీ) నుంచి కొత్త రేట్లు అమలు చేస్తున్నాయి. ప్రతినెల 1వ తేదీన ఎల్పిజి ధరలను సవరించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అదేవిధంగా ధరల మార్పులు కొనసాగుతున్నాయి.
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల సిలిండర్ పై 42 రూపాయలు పెరిగింది. దాంతో వాణిజ్య సిలిండర్ ధర 3113.50 రూపాయలకు చేరింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఈ స్థాయిలో ఉంటుందని ఎవరు ఊహించలేదు. అంతేకాకుండా ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పిజి సిలిండర్ల ధర కూడా పెరిగింది. ఒక్కో సిలిండర్ పై 11 రూపాయలు పెరిగింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలలో ఎలాంటి మార్పులు లేవు.









