మాడుగులపల్లి : విద్యుత్ షాక్ తో మహిళ మృతి..!

విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.

మాడుగులపల్లి : విద్యుత్ షాక్ తో మహిళ మృతి..!

మాడుగులపల్లి, మనసాక్షి:

విద్యుత్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన మాడుగులపల్లి మండలం పాములపహాడ్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  పాములపహాడ్ గ్రామానికి చెందిన కుర్రి రేణుక భర్త రాజు అనే మహిళ ఉదయం ఇంట్లో బట్టలు అరెస్తున్న క్రమంలో ఇనుప దండానికి విద్యుత్ ప్రవహించడంతో కరెంట్ షాక్ తగిలి ఒక్కసారిగా ఇంటి బెస్మెంట్ మీద పడడంతో బేస్మెంట్ తల కు గట్టిగా తగలడంతో కింద పడిపోయి అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఆమెను పరిశీలించిన డాక్టర్స్ చనిపోయిందని ధ్రువీకరించారు. మృతురాలి భర్త రాజు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందగా భార్య ఇప్పుడు చనిపోవడంతో వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆమె మరణంతో ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారు.రేణుక మరణంతో గ్రామ ప్రజలు బంధులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తలించారని తెలిపారు.

ALSO READ : 

BRS : సమావేశానికే ఎమ్మెల్యేలు డుమ్మా.. GHMCలో అవిశ్వాసం నెగ్గేనా..?

Good News : రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన..!