Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESక్రీడలుజాతీయంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

మఠంపల్లి : జాతీయ స్థాయి మహిళా కోలాట పోటీలు

మఠంపల్లి : జాతీయ స్థాయి మహిళా కోలాట పోటీలు

మఠంపల్లి  మన సాక్షి:

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో జాతీయస్థాయి కోలాట పోటీలు ప్రారంభమ య్యాయి . మఠంపల్లి మండలంలోని శుభవార్త దేవాలయ 115వ మహోత్సవ సందర్భంగా శుభోదయ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల గ్రామీణ మహిళా కోలాట ప్రదర్శన పోటీలు బుధవారం శుభవార్త దేవాలయ ఆవరణలో విచారణ గురువులు ఫాథర్ మార్టిన్ పసల ,ఫాథర్ ,అల్లం బాలరెడ్డి, శుభోదయ యువజన సంఘం అధ్యక్షులు గాదె జయభారత్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి ,చర్చి కమిటీ పెద్దలు బోయపాటి అంథోని రెడ్డి,రాయ భాస్కర్ రెడ్డి లు ఘనంగా ప్రారంభించారు.

ఈ కోలాటం పోటీలు ఏప్రిల్ 26 నుండి 28 వరుకు జరుగును. ఇట్టి పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ధర్మురి వెంకటేశ్వర్లు, కొమ్ము యేసు పాదం లు వ్యవహరిస్తున్నారు.

 

ఈ పోటీలకు బహుమతుల దాతల వివరాలు బహుమతులు మొదటి బహుమతి 40,వేల రూపాయలు దాత క్రీస్తు శేషులు మేజర్ గాలి ఎన్నారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు గాలి ఆనందరెడ్డి, రెండో బహుమతి 35వేల రూపాయలు దాత గాయం సన్నిహిత రెడ్డి,

 

మూడో బహుమతి 30 వేల రూపాయలు దాత క్రీర్తి శేషులు కొమ్మారెడ్డి జోజిరెడ్డి, క్రీస్తు శేషులు కొమ్మారెడ్డి చిన్నమ్మ, ఈదర రోహిత్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుడు కొమ్మారెడ్డి అంతోరెడ్డి, నాలుగో బహుమతి 25 వేల రూపాయలు దాత క్రీస్తు శేషులు రాయ బెర్నా రెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బోయపాటి చిన్న ఇన్నారెడ్డి, ఐదవ బహుమతి 20 వేల రూపాయలు దాత మారంరెడ్డి వినోద్ రెడ్డి, ఆరో బహుమతి 15 వేల రూపాయలు దాత గోపు ఇన్న ప్రతాపరెడ్డి బ్యాంకు మేనేజర్ గోలమారి మర్రెడ్డి, ఏడవ బహుమతి 10 వేల రూపాయలు దాత ఆదూరి కృష్ణారెడ్డి ఆదూరి సుందరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆదూరి పాపిరెడ్డి,ఎనిమిదవ బహుమతి 8,000 రూపాయలు దాత తుమ్మమరెడ్డి జ్ఞాపకార్థం వారి మనుమలు తుమ్మమరెడ్డి తుమ్మ వినయ్ రెడ్డి.లు దాతలుగా ముందుకు వచ్చారు.

 

ఇట్టి కార్యక్రమంలో బ్రదర్ వినోద్ రెడ్డి,సిస్టర్స్ సంఘ సభ్యులు ఎంపీటీసీ కటికల నర్సయ్య, చర్చి పెద్దలు గ్రామ పెద్దలు ,మండల ప్రజలు,ఆసక్తి గా కోలాటాన్ని తిలకిస్తున్నారు.

మరిన్ని వార్తలు