మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి : జూలకంటి

 వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి : జూలకంటి

 వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ

మిర్యాలగూడ టౌన్,మన సాక్షి:

శాంతిభద్రతలను కాపాడలేని మణిపూర్ ప్రభుత్వాన్ని తక్షణమే భర్త రఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మణిపూర్ ప్రజలకు సంఘీభావంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.సిపిఎం కార్యాలయం నుండి రాజీవ్ చౌక్, బస్టాండ్ మీదుగా రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేశారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణిపూర్ లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మణిపూర్లో రావణ కాష్టం జరుగుతున్న పట్టించుకోలేదని ఆరోపించారు.హింసకాండను వివరించేందుకు అక్కడ ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చి నెల రోజులపాటు ప్రధాని అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసిన ఫలితం దక్కలేదని మోడీ నిర్లక్ష్యం చేయడం వల్లనే మణిపూర్లో ఈ హింసకాండ జరుగుతుందని తెలిపారు.

 

ALSO READ : 

  1. Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
  2. Tweet : హలో మేడమ్.. మంత్రి సబిత ఇంద్రారెడ్డికి ట్వీట్ల వెల్లువ.. !
  3. Rain : తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..!
  4. Telangana : తెలంగాణలో దివ్యాంగులకు పెన్షన్ పెంపు..!

 

దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. మహిళలపై అగత్యాలకు పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో శాంతి వాతావరణం కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్కడి ప్రజలకు రక్షణ కల్పించాలన్నారు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం ఏర్పడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

 

బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందని ఆరోపించారు. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని ప్రజల మధ్య చిచ్చురోపి అధికారం కోసం పాకులాడుతున్నారని విమర్శించారు అలాంటి ప్రభుత్వాలకు వచ్చే ఎన్నికల్లో ఓడించి గుణపాఠం చెప్పాలన్నారు .

 

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులు నూకల జగదీష్ చంద్ర, రవి నాయక్,డా. మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, పరుశురాములు, రాగిరెడ్డి మంగా రెడ్డి,తిరుపతి రామ్మూర్తి, పోలేబొయిన వరలక్ష్మి, జాతంగి సైదులు, ఎండి అంజాద్,దేశిరం నాయక్, రాంచంద్రు, పథాని శ్రీను, బిఎం నాయుడు, సీపీఐ నాయకులు బంటు వెంకటేశ్వర్లు,లింగా నాయక్, వస్కుల సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.