Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
సినిమాBreaking Newsతెలంగాణ

Gunde Ninda Gudi Gantalu : దొరికిపోయిన మనోజ్.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన రోహిణి.. గుండె నిండా గుడి గంటలు.. ఫిబ్రవరి 27 ఎపిసోడ్..!

Gunde Ninda Gudi Gantalu : దొరికిపోయిన మనోజ్.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన రోహిణి.. గుండె నిండా గుడి గంటలు.. ఫిబ్రవరి 27 ఎపిసోడ్..!

స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. సీరియల్ నటినటులు సాధారణంగా నటించడం వల్ల తెలుగు వారిని ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ గురువారం 27వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం..

గురువారం ఎపిసోడ్ లో బాలు ఇంటికి వచ్చి ఇంట్లో అందరినీ పిలిచి తెగ హడావుడి చేస్తాడు. ఆ సమయంలో ప్రభావతి కనిపించకపోవడంతో మా అమ్మ ఎక్కడ.. మా అమ్మ కావాలి అని గోల చేస్తూ హడావుడి చేస్తాడు.అంతలో ప్రభావతి వచ్చి ఏంట్రా చిన్న మెదడు చిట్లి పోయిందా అలా చేస్తున్నావ్ అనడంతో నీకేమి కాకూడదని కోరుకుంటున్నాను అమ్మా అని అంటూ బాలు చెప్తాడు.

అసలు ఏమైంది..? ఎందుకు..? అలా చేస్తున్నారు అని అంటుంది మీనా.. నువ్వేం మాట్లాడకు మీనా కొద్ది సేపట్లో అన్ని తెలుస్తాయి అని బాలు అంటాడు. అందరూ వచ్చారు మన సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనోజ్ రాలేదా..? అని వెటకారంగా అడుగుతాడు బాలు. ఇప్పుడు వాడితో నీకేం పని అంటుంది ప్రభావతి అంటోంది. అప్పుడు రోహిణి ఏదో మీటింగ్ ఉందని క్లైంట్ తో మాట్లాడాలని కొంచెం లేటుగా వస్తానని చెప్పాడు. అనడంతో ఓహో పాపం అలా చెప్పాడా..? అంటాడు బాలు. అసలు ఏమైంది రా నీకు ఇలా చేస్తున్నావు అని అంటుంది ప్రభావతి.

ALSO READ : TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి రేషన్ కార్డులు కట్..!

ఇప్పుడు మీకందరికీ ఒక సినిమా చూపించబోతున్నాను. ఈ పార్లర్ అమ్మ చీప్ గెస్ట్ అనడంతో అది చీఫ్ గెస్ట్ అన్నయ్య అనగా చీపే బాగుంది అని అంటాడు. బాలు వెళ్లి నీ లాప్టాప్ తీసుకొనిరా అనడంతో రవి వెళ్లి లాప్టాప్ తీసుకొని వస్తాడు. ఎవరు ఏం మాట్లాడకుండా నేను చూపించే ఒక సన్నివేశం చూడండి. అని బాలు లాప్టాప్ కి మొబైల్ కనెక్ట్ చేసి పార్కులో చేసేది మొత్తం చూపించడంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

రోహిణి కి ఏం మాట్లాడాలో తెలియక షాక్ అవుతుంది. చూశారు కదా మన డబ్బులు మింగినోడు రోజు ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్పి పార్కులోకి వెళ్లి చేసేది ఇదే. ఉదయం ఏడు గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం నాలుగు గంటలకు అంటూ మనోజ్ చేసే ప్రతి ఒక్క పనిని అందరికీ వివరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభావతమ్మ ఒరే ఒరే ఇప్పటికైనా ఆపరా అనడంతో ఆశ దోశ ఇంకా ఉంది చూడు అని అంటాడు బాలు.

ALSO READ : Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!

ప్రభావతి దొరికిపోయిందని భయపడుతూ ఉంటుంది. మనోజ్ తనని మోసం చేశాడని కన్నీళ్లు పెట్టుకుంటుంది రోహిణి. అప్పుడు మీనా ప్రతిరోజు నీ మొగుడు క్యారీ కట్టకపోతే అత్తయ్యతో తిట్టించి మరీ వెలగదీస్తున్న ఉద్యోగం ఇదేనా అంటుంది. అప్పుడు రోహిణి అవమానంతో తలదించుకుంటుంది. వెంటనే శ్రుతి ఎంత మోసం.. ఇంత ఫ్రాడా అనడంతో అలాంటిదేమీ లేదమ్మా అంటుండగా నువ్వు కవర్ చేయకు ప్రభావతమ్మ అని అంటాడు బాలు.

ఇంతలో మనోజ్ వచ్చి ఇలాంటి పూల బండ్లన్నీ పెడితే నా పరువు ఏం కావాలి. ఒక్క తన్ను తంతే ఎక్కడ పోయి ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి అంటూ రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు. అప్పుడు అవునా అన్నయ్య అని అంటాడు బాలు. ప్రభావతి సైగలు చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా మనోజ్ రెచ్చిపోతాడు.

ALSO READ : Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

అప్పుడు లాప్టాప్ లో వీడియో చూపించడంతో మనోజ్ షాక్ అవుతాడు. చూడగానే రోహిణి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదంతా కొన్ని నెలలుగా సాగుతోంది. ఇదంతా మన తల్లి ప్రభావతం తెలుసు అని అడ్డంగా ఇరికిస్తాడు బాలు. అవునా అని సత్యం నిలదీయడంతో అవును అని అంటుంది ప్రభావతమ్మ. దాంతో కొడుకు, భార్యని ఫుల్ గా తిడుతూ చివాట్లు పెడతాడు సత్యం.

మరిన్ని వార్తలు