Telangana : వివాహ వేడుకలకు వెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి..

హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఓ కుటుంబం వివాహ వేడుకలకు వెళ్ళింది. వారు తిరిగి వచ్చేసరికి వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ లో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.

Telangana : వివాహ వేడుకలకు వెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి..

హైదరాబాద్ , మన సాక్షి :

హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఓ కుటుంబం వివాహ వేడుకలకు వెళ్ళింది. వారు తిరిగి వచ్చేసరికి వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ లో దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. హైదర్ గూడ, కేశవ్ నగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దొంగలు పడి దోచుకుని పరారయ్యారు.

రెండు తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇంటి పత్రాలను కూడా చోరీ చేశారు. అక్కడ వరుసగా మూడు ఇండ్లకు గడియ పెట్టి మరి దోచుకున్నారు. ఓ కుటుంబం వివాహ వేడుకలకు కర్నూలు వెళ్ళంది. ఆ కుటుంబానికి ఇక్కడి స్థానికులు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వెంటనే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.

రాజేంద్రనగర్ లోని హైదర్ గూడ, కేశవ నగర్ కాలనీలో ఇంటి తాళాలు దొంగతనాలు పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ALSO READ : Gas Cylinders : రూ.500 గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం మెలిక.. అందరికీ కష్టమే..!

తెలుగులో బ్రేకింగ్ న్యూస్ మన సాక్షిలో చదవండి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ వార్తలతో పాటు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ చదవండి.