ములుగు : ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు
ములుగు : ఘనంగా మట్టల ఆదివారం వేడుకలు
శాంతి సందేశం అందించిన పాస్టర్ లూక
వెంకటాపురం, మన సాక్షి:
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని భోదాపురం గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టబోరు వద్ద ఉన్న జి ఎస్ ఎస్ చర్చిలో మట్టల ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి వీధి తిరుగుతూ ఏసుక్రీస్తు సువార్త ప్రకటిస్తూ యేసు లోక రక్షకుడని యేసు సత్యము, జీవము,మార్గము ఆయనేనని పూరవీధులలో తిరుగుతూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక సంఘ కాపరి పాస్టర్లు మాట్లాడుతూ యేసు క్రీస్తు శాంతి సమాధానానికి మూలపురుషుడని ఏసుప్రభు అందరికీ దేవుడని అంతే కాకుండా అకాల వర్షాల వలన నష్టపోయిన రైతుల కొరకు అదేవిధంగా అధికారుల కొరకు దేశ క్షేమం కొరకు ప్రార్థన నిర్వహించి శాంతి సందేశం అందించారు.
ఈ కార్యక్రమంలో సంఘ పెద్ద కంగాల. ఇస్సాక్ మహేష్, రూతమ్మ, నిషిత,హర్ష వర్ధిని, విక్టోరియా, దయవతి, జ్యోతి, అరుణ, నరేష్, శరా, సంఘం విశ్వాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.










