Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

మావోయిస్టుల ఆరాచకాల పట్ల అప్రమత్తం – ఓఎస్డీ సాయి మనోహర్

మావోయిస్టుల ఆరాచకాల పట్ల అప్రమత్తం – ఓఎస్డీ టి.సాయి మనోహర్

భద్రాచలం, మన సాక్షి

జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఆదేశాల మేరకు దుమ్ముగూడెం పోలీసుల ఆధ్వర్యంలో నిషేధిత మావోయిస్టు పార్టీ అరాచకాలపై మండలంలోని ములకనపల్లి గ్రామంలో చైతన్య సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ లు ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఓఎస్డీ టి.సాయి మనోహర్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

 

మావోయిస్టు నాయకుల వలన గానీ,మావోయిస్టు పార్టీ వలన గానీ ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని అన్నారు.పైగా ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధిని అడ్డుకుని ఆదీవాసి ప్రజల ఎదుగుదలకు అడ్డుపడుతున్నారని తెలియజేసారు.

 

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే మావోయిస్టు పార్టీకి ఏ ఒక్కరూ సహకరించకూడదని కోరారు. అనంతరం భద్రాచలం ఏఎస్పీ మాట్లాడుతూ తమ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు వాలీబాల్ కిట్లు,క్యారం బోర్డులు మరియ ఇతర క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగింది.అనంతరం గ్రామస్తులందరితో కలిసి పోలీస్ అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన సహపంక్తి విందులో పాల్గోన్నారు.

 

ఈ కార్యక్రమంలో సి ఆర్ పి ఎఫ్ డిఎస్పీ రేవతి,దుమ్ముగూడెం సిఐ రమేష్ ఎస్సైలు రవి,కేశవ మరియు సిబ్బంది పాల్గోన్నారు.

మరిన్ని వార్తలు