ముగిసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ అమెరికా పర్యటన

ముగిసిన మంత్రి కొప్పుల ఈశ్వర్ అమెరికా పర్యటన

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఘనస్వాగతం

హైదరాబాద్, మనసాక్షి :

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అమెరికా పర్యటన ముగిసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు.

 

పది రోజుల పాటు అమెరికా లో పర్యటించి నగరానికి వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పలువురు బిఆర్ఎస్ నేతలు ఘనస్వాగతం పలికారు. అమెరికా పర్యటన విజయంతం అయ్యిందని మంత్రి కొప్పుల చెప్పారు. అమెరికాలో స్థిర పడిన తెలుగు ప్రజలు మంచి ఆధారాభిమానాలు కనబరిచారని చెప్పారు.

 

అమెరికాలో తెలంగాణ ప్రవాస వాసులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యానని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమవంతు సహకారం ఉంటుందని విదేశీ సంస్థలు హామీ ఇచ్చాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.