వాణిజ్య పంటలు పండించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి
వాణిజ్య పంటలు పండించాలి – మంత్రి నిరంజన్ రెడ్డి
నల్గొండ , మనసాక్షి : రైతులు మూస పద్ధతి కాకుండా వాణిజ్య పంటలు పండించే విధంగా అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. బుధవారం నల్గొండ, సూర్యాపేట జిల్లాల వ్యవసాయ అధికారులకు, రైతు బంధు సమితి సభ్యులకు, వానాకాలం సాగు పై నిర్వహించిన వర్క్ షాప్ లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. 2020 – 21 వ సంవత్సరంలో మూడుకోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండించారని అన్నారు. తెలంగాణ ప్రస్తుతం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగటం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బీడు భూములు అన్ని వివిధ రకాల పంటలతో కళకళలాడుతున్నాయన్నారు. ప్రజల జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయని, అందుకు అనుగుణంగా వాణిజ్య పంటలు పండించాలని ఆయన సూచించారు. నూనె గింజల కొరత తీవ్రంగా ఉన్నందున రైతులు ఆయిల్ పామ్ సాగు పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, నల్గొండ జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, ఎంపీ లింగయ్య యాదవ్ , ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, సైది రెడ్డి, ఎమ్మెల్సీ కోటి రెడ్డి, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రజాక్, సూర్యాపేట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకట నారాయణ, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ , సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
1. కోదాడలో కారు ఢీకొని మహిళ మృతి
2. బంగ్లాదేశ్ టు భారత్ : నదిలో ఈది.. ప్రియుడు చెంతకు చేరిన మహిళ..!
3. కాంగ్రెస్ పార్టీ టికెట్ లపై మాణిక్యం ఠాగూర్ కీలక ప్రకటన









