Ponguleti : గురుకుల విద్యార్థినిలతో మంత్రి పొంగులేటి మధ్యాహ్న భోజనం..!
Ponguleti : గురుకుల విద్యార్థినిలతో మంత్రి పొంగులేటి మధ్యాహ్న భోజనం..!
నేలకొండపల్లి, మన సాక్షి :
ప్రతిపక్షాల మొసలి కన్నీళ్లు ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలం లోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
మండల కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి వేడుకలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు..ఈ ఏడాది కనివిని ఎరగని రీతిలో ధాన్యం పండిందని -అన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల ను . ఏర్పాటు చేసిందని అన్నారు. సన్న దాన్యానికి రూ.500 బోనస్.ఇస్తున్నామని అన్నారు.
గత పదేళ్లలో వారి పరిపాలన రైతులను ఏ విధంగా ఆదుకున్నారో అందరం చూశామని అన్నారు. ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని అన్నారు. 55 వేల మెట్రిక్ టన్నుల వస్తాయని అన్నారు. రైతులను ఎక్కడా ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
కేంద్రాల వద్ద రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నేలకొండపల్లి గురుకుల బాలికల పాఠశాల ను సందర్శించారు. విద్యార్ధినులతో ముచ్చటించారు.
మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాములు, కాంగ్రెస్ నాయకులు శాఖమూరి రమేష్, వెనికె జానకిరామయ్య, కొర్లకుంట్ల నాగేశ్వరరావు, రాయపూడి నవీన్, బచ్చలకూరి నాగరాజు, అంజిని, కొమ్మినేని విజయబాబు, తేజ వత్ కోటేశ్వరరావు, భూక్య గోబ్రియా,
భూక్య సీత, చిన్న నాయక్, గరిడేపల్లి రామారావు, హనుమంతురావు, .జె.సత్యనారాయణ, కొమ్మూరి నరేష్, మార్తి కోటి, లక్కం ఏడుకొండలు, కడియాల నరేష్, వల్లాల రాధాకృష్ణ, రాధాకృష్ణమూర్తి, మైశా శంకర్, బోయిన వేణు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
TG News : తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం..!
-
Viral Video : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. పేరెంట్స్ కు దొరికింది, ఎలానో చూస్తే నవ్వుకోవాల్సిందే.. (Video)
-
Gold Price : పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. తెలుగు వారిని ఒక్కరోజే మురిపించింది..!
-
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా.. ముఖంపై అవాంచిత రోమాల తొలగింపు.. ఇదొక్కటి చాలు..!









