Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

మిర్యాలగూడ : మంత్రుల పర్యటనపై కాంగ్రెస్ నాయకుల సంచలన వ్యాఖ్యలు..!

మిర్యాలగూడ : మంత్రుల పర్యటనపై కాంగ్రెస్ నాయకుల సంచలన వ్యాఖ్యలు

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ పట్టణంలో రాష్ట్ర మంత్రులు హరీష్ రావు జగదీశ్ రెడ్డి పర్యటనపై కాంగ్రెస్ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ…

 

బి ఆర్ ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప చేసింది శూన్యం అని, మిర్యాలగూడలో అనేక సమస్యలు ఉన్నా కానీ ఈ స్థానిక నాయకులైన ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ మరి ఇతర నాయకులు కూడా మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకపోలేని అసమర్థులుగా మిగిలిపోయారన్నారు.

ఇదే మంత్రులు గతంలో వచ్చి శంకుస్థాపన చేశారు. మళ్లీ వచ్చి ఇప్పుడు శంకుస్థాపన చేశారు. తప్ప మిర్యాలగూడకు వీరు కొత్తగా చేసింది ఏమీ లేదని, ఇక వేదిక మీద ఉన్న నాయకులు ఒకరిని ఒకరు పొగుడుకోవడం తప్ప మిర్యాలగూడ ప్రజలకు వారు చేసింది ఏమీ లేదన్నారు.

మంత్రులు మాట్లాడుతూ జిల్లాలో 12 కి 12 సీట్లు గెలుస్తామ నీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లను భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎంత మాత్రం జరిగిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులుగా మారినారని మంత్రులు మాట్లాడం జరిగిందని..

 

తెలంగాణ ఇచ్చింది.. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ .. కేంద్రంలో ఆరోజు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ ని ఒప్పించి తెలంగాణ తీసుకు రావడం జరిగిందన్నారు.
బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ పేరుతో పదవులు అనుభవిస్తూ…. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అవివేకంతో మాట్లాడడం… వారి అవివేకానికి, మితిమీరిన గర్వంతో మాట్లాడే మాటలు సిగ్గుచేటన్నారు.

 

గతంలో మేం చెప్పిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ గతంలోనే చేశాము.. ఇప్పటికీ ఇది పూర్తి కాలేదు. కాంగ్రెస్ పార్టీ పదహారువేల కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇస్తే ఐదు లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం అధికారమున తెలంగాణ రాష్ట్రాన్ని ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేయడం జరిగిందన్నారు.

 

మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు దండుకొని ఈరోజు ఏవార్డులలో నీళ్లు సరిగా రాక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, దానిపై మేము పోరాటం చేసినా దాన్ని మర్చిపోయారని, మినీ ట్యాంక్ బండ్ మర్చిపోయారని, అనేక సమస్యలు తెలియ జేసినప్పటికీ బి ఆర్ ఎస్ నాయకులు మొద్దు నిద్రపోతూ వారి స్వలాభం కోసం చూస్తున్నారు తప్ప మంత్రుల దృష్టికి కనీసం తీసుకుపోలేని దౌర్భాగ్యులు ఇక్కడి నాయకులు అన్నారు.

 

ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే స్టేషన్ నుంచి ఈదులగూడెం వరకు రోడ్ల అభివృద్ధి చేస్తున్నామని … ఆయన సొంతంగా చేస్తున్నట్లు బూటకపు మాటలతో ప్రజలను నమ్మించే విధంగా మాట్లాడడం అవివేకమన్నారు.

 

 

దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, అది నేషనల్ హైవేకి సంబంధించిన వర్కు అని ఎంపీ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి మిర్యాలగూడలో రోడ్ల విస్తరణకు నిధులు ఏర్పాటు చేయించిన ఘనత ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డిది అని, ఇంకా tsufidc కింద రెండు వేల కోట్ల నిధులు తీసుకువచ్చినమని, పట్టణం మొత్తం అభివృద్ధి జరిగిందని అబద్ధపు మాటలు కల్ల బొల్లిమాటలు చెప్పిన ఎమ్మెల్యే భాస్కర్ రావు పట్టణంలో ఏ వార్డుకు పోయినా డ్రైనేజీలు లేవు… రోడ్లు లేవు .. తాగునీరు సరిగా రాదు… అనేక సమస్యలు ఉన్నా… పట్టణం మొత్తం అభివృద్ధి జరిగిందని…. మంత్రుల దగ్గర గొప్పలు చెప్పడం సరికాదన్నారు.

 

మిర్యాలగూడ ప్రజలకు కావలసిన కనీస అవసరాలు ఈ ఎమ్మెల్యే మర్చిపోయిన సంగతిని తీవ్రంగా ఖండిస్తున్నామని, tsufidc కింద తెచ్చిన 200 కోట్ల ఎవరి జేబులోకి పోయినాయని, ఈ ఎమ్మెల్యే ఎందుకు బూటకపు మాటలు చెబుతున్నాడని, ఈ రెండు వందల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయో చెప్పాల్సిన అవసరం ఈ ఎమ్మెల్యేకి ఉందన్నారు. రాబోయే ఎలక్షన్లలో బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

 

ఈ సమావేశంలో డిసిసి సభ్యులు చిలుకూరి బాలు , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడ బోయిన అర్జున్ , కౌన్సిలర్లు దేశిడి శేఖర రెడ్డి , గంధం రామకృష్ణ, గుంజా శ్రీను , కాంగ్రెస్ యువజన అధ్యక్షుడు సిద్దు నాయక్ , బిసి సంఘం అధ్యక్షుడు పోలగాని వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు