Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : నేడు మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. సభ ఎన్ని గంటలకంటే..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం ఆయన పర్యటించనున్నారు.

Miryalaguda : నేడు మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ.. సభ ఎన్ని గంటలకంటే..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు మంగళవారం పరిశీలించారు.

హేలిప్యాడ్, ప్రధాన వేదిక, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా చేసే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల శిలాఫలకాల స్థలం, బహిరంగ సభకు హాజరయ్యే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు, తాగునీరు,బ్యారికేడింగ్, తదితర అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా మిర్యాలగూడ రూరల్ పరిధిలోని గూడూరు వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ, ఇతర ఏర్పాట్లను చేయడం జరుగుతున్నది.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డి ఎస్ పి రాజశేఖర్ రాజు,జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర అధికారులు ఉన్నారు.

మిర్యాలగూడలో సీఎం సభ షెడ్యూల్ :

బుధవారం 2. 30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి నుంచి బేగంపేట చేరుకుంటారు. బేగంపేట నుంచి 3. 30 గంటలకు మిర్యాలగూడలోని గూడూరు చేరుకుంటారు. 3. 30 గంటల నుంచి 3.50 నిమిషాల వరకు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం గూడూరులోని బహిరంగ సభలో 3.55 నుంచి 4.40 వరకు ప్రసంగిస్తారు. 4.45 కు గూడూరు నుంచి బయలుదేరి 5.35 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

MOST READ 

  1. Hyderabad : హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్ వేర్ద్ ఉద్యోగిని..!

  2. Rythu Bharosa : రైతు భరోసా శాటిలైట్ సర్వే పూర్తి.. షాకింగ్ నిజాలు, లేటెస్ట్ అప్డేట్..!

  3. Gold Price : మళ్లీ వేలల్లో పడిపోయిన పసిడి.. భారీగా దిగివచ్చిన ధర..!

  4. Tragedy : తీవ్ర విషాదం.. హైదరాబాద్ లో రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..!

మరిన్ని వార్తలు